బిజినెస్

హైనెస్ కంపెనీకి 49శాతం వాటాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: గురుగ్రామ్‌లో నిర్మించబోయే భారీ వాణిజ్య సముదాయ ప్రాజెక్టులో 49 శాతం వాటాలను అమెరికాకు చెందిన హైనెస్ కంపెనీకి అమ్మాలని ప్రముఖ రియాలిటీ సంస్థ డీఎల్‌ఎఫ్ నిర్ణయించింది. 900 కోట్ల రూపాయల విలువైన ఈ వాటాల అమ్మక ప్రక్రియ ఈ ఏడాది డిసెంబర్‌లోగా పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఎనిమిదో నంబర్ జాతీయ రహదారిపై వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు, సుమారు 1,500 కోట్ల రూపాయల వ్యయంతో 11.76 ఎకరాల భూమిని డీఎల్‌ఎఫ్ కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు ప్రక్రియను హర్యానా ప్రభుత్వం ఈ-ఆక్షన్ ద్వారా నిర్వహించింది. కాగా, వాటాల అమ్మకానికి సంబంధించి హైనెస్ సంస్థతో లాంఛనప్రాయమైన ఒప్పందం కుదుర్చుకున్న డీఎఫ్‌ఎల్, వాటాలను 51:49గా ఖరారు చేసింది. వాటాల అమ్మకానికి రంగం సిద్ధంకాగా, లాంఛనప్రాయ ఒప్పందాన్ని అనుసరించి, డిసెంబర్ మాసంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని డీఎల్‌ఎఫ్ స్పష్టం చేసింది.