బిజినెస్

మరింతగా రూపాయి పతనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంబయి, నవంబర్ 4: రూపాయి మారకపు విలువ తగ్గే సూచనలు కనిపించడం లేదు. మధ్యమధ్యలో ఒకటిరెండుసార్లు డాలర్‌కు రూపాయి విలువ పెరిగినట్టు కనిపించినా, స్థూలంగా చూస్తే మాత్రం పతనం కొనసాగుతునే ఉంది. వచ్చే మూడు నెలల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రమంగా పెరుగుతున్న డాలర్ విలువ 76 రూపాయలకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తున్నదని అంటున్నారు. ఫోరెక్స్ ట్రేడింగ్‌లో డాలర్ రేటు ఇప్పటికే 74 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ తీరుతెన్నులను గమనిస్తే, డాలర్ బాగా బలపడుతున్నది. నిలకడగా వృద్ధి రేటును అందుకుంటున్న అమెరికా తన కరెన్సీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నది. గ్లోబల్ మార్కెట్‌లో డాలర్ విలువ బలపడడం పరోక్షంగా రూపా యి మారకపు విలువ పతనానికి కారణమవుతున్నది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ యూబీఎస్ వారాంతపు సమీక్షలో డాలర్ విలువ పెరగడం, రూ పాయి పతనాన్ని ప్రముఖంగా పేర్కొం ది. మరో మూడు నెలల్లో డాలర్ రేటు 76 రూపాయలకు చేరడం ఖాయంగా కనిపిస్తున్నదని యూబీఎస్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఫోరెక్స్ మార్కెట్‌లో నెలకొన్న అస్థిరతను పోగొట్టి, రూపాయి విలువను పెంచడానికి ఆర్‌బీఐ చేసిన కృషి చెప్పుకోదగిన ఫలితాన్ని ఇవ్వలేదు. అంతేగాక, ప్రస్తుత అస్థిరత కారణంగా విదేశీ మారకం నిలువలు 25 బిలియన్ డాలర్లు వరకూ తగ్గాయి. ప్రస్తుతం ఆర్‌బీఐ వద్ద 393 బిలియన్ డాలర్ల ఫోరెక్స్ రిజర్వులున్నాయి. గత నెల జరిగిన సమావేశంలో రెపో రేట్‌ను పెంచకుండా జాగ్రత్త పడడం ద్వారా, వడ్డీ రేట్ల పెరుగుల వల్ల కలిగే నష్టాలను నివారించే పనికి ఆర్‌బీఐ ఉపక్రమించింది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మాసం మధ్యలో ఫోరెక్స్ నిల్వలు 32.78 బిలియన్ డాలర్ల వరకూ తగ్గడంతో, ఆర్‌బీఐ వద్ద రిజర్వుల మొత్తం 392.078 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అయితే, అక్టోబర్ మాసంలో డాలర్ నిల్వలు పెరిగి ఇప్పుడు 393 బిలియన్ డాలర్లకు చేరా యి. ప్రస్తుతం పరిస్థితి కొంత ఆశావహంగానే కనిపిస్తున్నప్పటికీ, నిలకడ కోల్పోయిన రూపాయి పతనంవైపే కొనసాగుతుందని యూబీఎస్‌తోపా టు వివిధ నివేదికలు, అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది మొదటి నెలాఖరులోగా డాలర్ విలువ రూ.76 చేరుతుందని జోస్యం చెప్తున్నాయి. అటు ప్రభు త్వం, ఇటు ఆర్‌బీఐ గట్టి చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్తులో రూపా యి మారకం విలువ మరింతగా దిగజారడం ఖాయమని స్పష్టమవుతున్నది.