బిజినెస్

పెట్టుబడుల సలహాదారు తన్వార్‌పై సెబీ నిషేధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 8: కేపిటల్ ట్రూ పైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ యజమాని నరేంద్ర సింగ్ తన్వార్‌ను పెట్టుబడుల సలహాదారుడిగా ఉండరాదంటూ మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ గురువారం నిషేధం విధించింది. తన్వార్ మదుపర్లను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని సెబీ ఆక్షేపించింది. ఇప్పటి వరకు మదుపర్లు పెట్టుబడి పెట్టిన సొమ్మును తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఏ ఇతర సంస్థలకూ మళ్లించకూడదని మార్కెట్ వాచ్ డాగ్ సెబీ ఆదేశించింది. అంతేకాకుండా తన్వార్ వద్దకు వచ్చిన క్లెయింట్లు, వారివద్ద తీసుకున్న ఫీజుకు సంబందించిన జాబితాను 21 రోజుల్లో సమర్పించాల్సిందిగా కూడా సెబీ ఆదేశించింది. సెక్యూరిటీస్ మార్కెట్‌లో సొమ్ము మదుపు చేయడం ద్వారా కేవలం నాలుగు నెలల తక్కువ వ్యవధిలోనే అధిక లాభాలు పొందవచ్చని నరేంద్రసింగ్ తన్వార్ అధిక ఫీజు తీసుకుని తనను మోసగించాడంటూ గత ఆగస్టు మాసంలో ఓ బాథితుడు సెబీకి ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో పరిశీలించగా పెట్టుబడుల సలహాదారుడిగా వ్యవహరించేందుకు ఇతను సెబీ నుంచి రిజిస్ట్రేషన్ పొందినట్లు తేలింది.