బిజినెస్

19న ఆర్‌బీఐలో ఏమవుతుంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఈ నెల 19వ తేదీన రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై అన్ని పార్టీలు, పారిశ్రామికవేత్తలు, మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇటీవల కాలంలో ఆర్‌బీఐ, కేంద్రం మధ్య ప్రచ్చన్నయుద్ధం జరుగుతున్న విషయం విదితమే. ఆర్‌బీఐ బోర్డులో 18 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య జరుగుతున్న వివాదాన్ని విశే్లషిస్తున్నారు. ప్రభుత్వం ఆర్‌బీఐ చట్టంలోని ఏడవ సెక్షన్ కింద ఆదేశాలు ఇస్తుందా ? ప్రభుత్వ రంగ సంస్థల మొండి బకాయిలు పేరుకుపోతున్నాయి. వీటి వసూళ్లకు ఆర్‌బీఐ తీసుకునే కఠిన నిర్ణయాలు ఏమిటి అనే దానిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆర్‌బీఐ ఇప్పటికీ పాత చట్టాల ప్రాతిపదికపైన నడుస్తోంది. మార్పులు, సంస్కరణలకు అతీతంగా ఆర్‌బీఐ అడుగులు వేస్తోంది. ఆర్‌బీఐ అటానమీ మంచిదే. కాని హ్రస్వదృష్టితో ఆలోచించే ఆర్థిక నిపుణులు ఆర్‌బీఐలో వేలుపెడితే దేశానికి మంచిది కాదని మొండిగా వాదిస్తున్నారు. కాని ఏ మాత్రం నిజం లేదని కొత్త తరం ఆర్థిక రంగ నిపుణులంటున్నారు.
ఆర్‌బీఐ గురించి చాలా మంది ప్రజలు పట్టించుకోరు. కాని ఇటీవల కాలంలో పతాక శీర్షికల్లో వస్తున్న కథనాలను చూసి ప్రజలు కూడా ఆర్‌బీఐ విధులు, అధికారాలపై తెలుసుకుంటున్నాలరు. ఆర్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం బోర్డులో 18 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి 21 మంది సభ్యులు ఉండాలి. ఇందులో గవర్నర్ ఉర్జిత్ పటేల్, నలుగురు డిప్యూటీ గవర్నర్లు, 13 మంది ప్రభుత్వం నామినేట్ చేసిన వారు డైరెక్టర్లుగా ఉన్నారు. వీరిలో ఇద్దరు ఇద్దరు ఆర్థిక శాఖ కార్యదర్శులు అంటే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్దర్శి రాజీవ్ కుమార్ ఉన్నారు. స్వదేశీ విధానాల కర్త స్వామినాథన్ గురుమూర్తి, సహకార బ్యాంకు నిపుణులు సతీష్ మారథేను ప్రభుత్వం పార్ట్‌టైమ్ నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా నియమించింది. ఆర్‌బీఐ చట్టం కింద ప్రభుత్వానికి బోర్డు సభ్యులను నియమించే అధికారం ఉంది. వివిధ రంగాలకు చెందిన పది మందిని నాన్ అఫిషియల్ డైరెక్టర్లుగా, ఇద్దరు ప్రభుత్వాధికారులను ప్రభుత్వానికి నియమించే అధికారం ఉంది. ఆర్‌బీఐకు ఉన్న నాలుగు ప్రాంతీయ బోర్డుల నుంచి ఒక్కొక్కరిని నాన్ అఫిషియల్ డైరెక్టర్‌గా నియమిస్తారు. ప్రస్తుత గవర్నర్ ఉర్జిత్‌పటేల్ 2016 సెప్టెంబర్‌లో గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
గతంలో ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్ 7ను ఏ ప్రభుత్వం కూడా ప్రయోగించలేదు. కాగా ఈ సెక్షన్‌ను కేంద్రం ప్రయోగించే అవకాశం ఉందని దుమారం ప్రారంభమైంది. ఈ సెక్షన్ కింద ఆర్‌బీఐను శాసించే అధికారం కేంద్రానికి ఉంది. ఆర్‌బీఐకి అటానమీ ఉంది. ఆర్‌బీఐ అటానమీని దెబ్బతీస్తే ఆర్థిక విపత్తు సంభవిస్తుందని ఆ సంస్థ డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. నిధులు బదలాయింపును కోరలేదు: కేంద్ర ఆర్థిక శాఖ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రూ.9.59 లక్షల కోట్ల నిధులు ఉన్నాయి. ఈ నిధుల్లో మూడో వంతు నిధులపైన కేంద్రం కన్ను పడింది. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుబాష్ చంద్ర గార్గ్ మాట్లాడుతూ ప్రనుత్వానికి ఈ నిధులతో అవసరం లేదన్నారు. ఆర్‌బీఐను ఈ నిధుల్లో రూ.3.6 లక్షల కోట్లను కేంద్రానికి బదలాయించాలని కోరదన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 3.3 శాతం ద్రవ్య లోటు ఉంటుందన్నారు. ఇవన్నీ అభూత కల్పనలని, వీటిల్లో నిజం లేదని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ద్రవ్య లోటు 2013-14లో 5.1 శాతం ఉండేదన్నారు. 2014-15 నుంచి ఈ లోటును తగ్గించడానికి కేంద్రం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చాయన్నారు. మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఆర్‌బీఐ వద్ద నిధులు మూలుగుతున్నాయని, ఇందులో రూ.4 లక్షల కోట్లను ప్రభుత్వ రంగ సంస్థల ప్రక్షాళనకు ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ ప్రతిపాదనను ఎవరూ పట్టించుకోవడంలేదు. మరోనాలుగు నెలల్లో ఎన్డీఏసర్కార్ కాలపరిమతి ముగుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆర్‌బీఐకు ఆర్థిక విధానాలను నిర్దేశించేందుకు కేంద్రం ఎందుకు తాపత్రయపడుతోందని మాజీ మంత్రి పి చిదంబరం ప్రశ్నించారు. ఈ నెల 19వ తేదీన బోర్డు అజెండా చాలా రోజుల క్రితమే ఖరారైంది. కాని సభ్యులు అజెండాలోని అంశాలను కూడా ప్రస్తావించవచ్చును. ప్రభుత్వం నామినేట్ చేసిన డైరెక్టర్లు, ఇండిపెండెంట్ డైరెక్టర్లు ఇంటీరియమ్ డివిడెండ్‌ను, ఆర్‌బీఐకు ఆర్థిక విధానాన్ని ఖరారు చేసే అంశాలను ప్రస్తావించవచ్చని సమాచారం. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1935 ఏప్రిల్ 1వ తేదీన బ్రిటీష్ ప్రభుత్వహయాంలో స్దాపించారు. ఆ రోజుల్లో సెక్షన్ 8 కింద బోర్డు సభ్యులు బ్యాంకు విధానాలను సమీక్షించేవారు. కాలక్రమంలో ఈ సెక్షన్ 7గా సవరణ చేవారు. 1949లో ప్రభుత్వ ఆధీనంలోకి ఆర్‌బీఐ వచ్చింది. కరెన్సీ నోట్లను జారీ చేయడంతో పాటు, ద్రవ్య, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండేందుకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుంది. ఆర్‌బీఐ ఇంకా పాత చట్టాల పరిధిలోనే పనిచేస్తోంది. ఆధునిక ద్రవ్య పరపతి విధానాలను ఆర్‌బీఐలో అమలు చేయాల్సి ఉందని ఆర్థిక నిపుణులంటున్నారు.