బిజినెస్

ద్వైపాక్షిక బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 14: ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఉన్న మార్గాలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆస్ట్రేలియా, థాయిలాండ్ ప్రధానమంత్రులతో చర్చించారు. వాణిజ్యం, రక్షణ, భద్రత వంటి అంశాలలో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై ఆయన చర్చలు జరిపారు. ప్రధాని మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటన బుధవారం ప్రతిష్ఠాత్మక ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో కీలకోపన్యాసం చేయడం ద్వారా ప్రారంభమయింది. ఫైనాన్సియల్ టెక్నాలజీకి సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్దదయిన ఈ కార్యక్రమంలో కీలకోపన్యాసం చేసిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. ఇక్కడ జరిగిన తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సదర్భంగా ప్రధాని మోదీ విడిగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, థాయిలాండ్ ప్రధానమంత్రి జనరల్ ప్రయూత్ చనోచాలతో ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొన్నారు. ‘సింగపూర్‌లో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్‌తో విడిగా సమావేశమయ్యారు. ఈ ఇద్దరు నేతలు భారత్-ఆస్ట్రేలియా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, ఇతర అంశాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవడంపై చర్చలు జరిపారు’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సందర్భంగా విడిగా థాయిలాండ్ ప్రధాని జనరల్ ప్రయూత్ చనోచాతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, అనుసంధానత వంటి అంశాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై చర్చలు జరిపారు’ అని ఆయన మరో ట్వీట్‌లో తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు పెన్స్ సింగపూర్ ప్రధానమంత్రి లీ హెయిన్ లూంగ్‌లతో కూడా మోదీ చర్చలు జరిపారు. మోదీ సింగపూర్ పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగే తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం, ఆసియాన్-ఇండియా అనియత సమావేశంలో పాల్గొంటారు.
ఇదిలా ఉండగా, మోదీ సింగపూర్‌కు బయల్దేరడానికి ముందు ఢిల్లీలో మాట్లాడుతూ ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలలో తాను పాల్గొనడం ఆసియాన్ సభ్య దేశాలతో కలిసి పనిచేయాలనే భారత్ నిబద్ధత కొనసాగింపునకు నిదర్శనమని అన్నారు. ఆసియాన్, తూర్పు ఆసియా దేశాలతో భారతదేశ భాగస్వామ్యం పెరుగుతోందని పేర్కొంటూ, ఈ పెరుగుదలలో తన సింగపూర్ పర్యటన కొత్త కదలికను తీసుకొస్తుందన్న విశ్వాసాన్ని మోదీ వ్యక్తం చేశారు.