బిజినెస్

వాణిజ్య అవకతవకలపై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉష్‌దేవ్ ఇంటర్నేషనల్ షేర్ల అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడిన 19 మందిపై మార్కెట్ నియంత్రణ విభాగం సెబీ కొరడా ఝళిపించింది. వీరికి 2.45 కోట్ల రూపాయల జరిమానాగా చెల్లించాలని సెబీ ఆదేశించింది. నేర తీవ్రతను బట్టి ఒక్కో వ్యక్తికి 5 నుంచి 30 లక్షల రూపాయల మొత్తాన్ని సెబీ జరిమానాగా విధించింది. ఉష్‌దేవ్ ఇంటర్నేషనల్స్‌లో 2010 ఏప్రిల్ నుంచి 2011 జనవరి వరకు చోటుచేసుకున్న అవకతవకలపై సెబీ పూర్తిస్థాయి విచారణ నిర్వహించింది. సెబీ చట్టంలోని మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు ఈ సందర్భంగా తేలింది. మొత్తం 19 మంది గ్రూపుగానూ, వ్యక్తిగతంగానూ నిర్వహించిన వ్యాపారంలో వారికి అనుకూలంగా అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని, ప్రత్యేకించి రివర్సల్ వ్యాపారం, చివరి వ్యాపార ధర (ఎల్‌టీపీ) ద్వారా ధరలను సైతం వారికి అనుకూలంగా నియంత్రించారని విచారణలో తేలింది. కొత్త అత్యున్నత ధర (ఎన్‌హెచ్‌పీ)ను ఏర్పాటు చేయడం ద్వారా వ్యాపారంలో అవకతవకలకు తెరలేపారని,స్క్రిప్ట్‌లో కృత్రిమ వాల్యూమ్‌ను సృష్టించి, పలు అంశాల్లో తప్పుతోవపట్టించేలా వ్యవహరించారని వెల్లడైందని సెబీ అడ్జుడికేటింగ్ ఆఫీసర్ షాహిల్ మాలిక్ తెలిపారు. మోసపూరిత, అక్రమ వ్యాపార కార్యకలాపాల నియంత్రణ చట్టం (పీఎఫ్‌యూపీ)ని 19 మంది ఉల్లంఘించినట్లు తేలిందని ఆయన తెలిపారు.