బిజినెస్

లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమావేశం, విదేశీ నిధుల ప్రవాహం నేపథ్యంలో మదుపరులు సానుకూలంగా స్పందించడంతో సోమవారం సెనె్సక్స్ 300 పాయింట్లకుపైగా ఎగబాకడంతో సూచీ ఆరువారాల గరిష్టస్థాయికి చేరుకుని 35,774.88కు చేరుకుంది. అలాగే ఆసియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కూడా మార్కెట్ లాభాలకు కారణమైంది. భవిష్యత్‌లో కొన్ని కీలక అంశాలలో నిర్ణయం తీసుకునేందుకు, ప్రస్తుతం కేంద్రబ్యాంకు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన విభేదాల నేపథ్యంలో సోమవారం సమావేశమైన రిజర్వ్ బ్యాంకు డైరెక్టర్ సమావేశంలో అనుకూల నిర్ణయాలు వెలువడవచ్చునని ఇనె్వస్టర్లు ఆశాభావంతో ఉండటంతో మార్కెట్ ప్రారంభం నుంచి సూచీలు లాభాల బాటలోనే పయనించాయి. 35,647.72 వద్ద ప్రారంభమైన సెనె్సక్స్ లాభాల దిశలో నడుస్తూ 35,818.65 గరిష్టస్థాయికి చేరుకుని ఎట్టకేలకు 35,774.48 వద్ద స్థిరపడి 317.72 పాయింట్లు, 0.92 శాతం లాభం నమోదు చేసింది. అక్టోబర్ మూడు తర్వాత ఇంత అధిక స్థాయిలో ముగియడం ఇ మొదటిసారి. అదేవిధంగా నిఫ్టీ 10,774.70 గరిష్టస్థాయిని తాకి 10,763.40 పాయింట్ల వద్ద ముగిసి 81.20 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. సెనె్సక్స్ లాభాలలో యెస్ బ్యాంకు కీలకపాత్రను పోషించింది. ఈ బ్యాంకు షేరు 7.19 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత మూడు వారాల్లో దీనికి ఇదే అధిక లాభం. అలాగే ఐటీసీ, టాటామోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత, సన్‌ఫార్మా, రిల్, ఎం అండ్ ఎం, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, ఎల్ అండ్ టి, విప్రో, టీసీఎస్, హీరో మోటారు కార్ప్, భారతీ ఎయిర్‌టెల్, అదాని పోర్ట్సు, కొటక్ బ్యాంక్, ప వర్ గ్రిడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, కోల్ ఇండియా షేర్లు 2.7 శాతం వరకు లాభాలను ఆర్జించాయి. కాగా, ఓఎన్‌జిసి, ఐసిఐసిఐ బ్యంక్, ఎస్‌బిఐ, ఏసియన్ పెయింట్స్, ఎన్‌టిపీసీ, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లలో లాభాల స్వీకరణ చేపట్టడంతో 1.37 శాతం వరకు నష్టాలను చవిచూశాయి. అత్యధికంగా జెట్‌ఎయిర్‌వేస్ స్టాక్ 6.88 శాతం నష్టాన్ని నమోదు చేశాయి.