బిజినెస్

స్వల్పంగా పెరిగిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 11: ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వంటి అంశాలు కీలక పాత్ర పోషించడంతో, మంగళవారం నాటి స్టాక్ మార్కెట్ స్వల్పంగా కోలుకుంది. గత వారం వరుస నష్టాలను ఎదుర్కొన్న సెనె్సక్స్ చివరిలో ఊరటనిచ్చింది. కానీ, ఈవారం మొదటి రోజైన సోమవారం మరోసారి పతనమైంది. ఏకంగా 713.53 పాయింట్లు తగ్గి, 34,959.72 పాయింట్లకు పడిపోవడంతో మంగళవారం పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. అదే సమయంలో ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ రాజీనామా చేయడంతో మార్కెట్ దిశ ఎటు మారుతుందోనన్న అనుమానాలు తలెత్తాయి. దీనికితోడు ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో, మార్కెట్‌కు ఒడిదుకులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమైంది. మంగళవారం ఉదయం నుంచి ఒకవైపు ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ మొదలుకాగా, దాని ప్రభావంతో స్టాక్ మార్కెట్ ఊగిసలాడింది. చివరికి 0.54 శాతం లాభాల్లో ముగిసింది. నిఫ్టీ కూడా సెనె్సక్స్ బాటను అనుసరిస్తూ 60.70 పాయింట్లు (0.58 శాతం) పెరిగి, 10,549.12 పాయింట్లకు చేరింది. ఆయిల్, గ్యాస్ కంపెనీలను మినహాయిస్తే, మిగతా రంగాలన్నీ ఎంతోకొంత లాభపడడం విశేషం. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్ బ్యాంక్, సన్‌ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, మహీంద్ర అండ్ మహీంద్ర, కోటక్ బ్యాంక్, కోల్ ఇండియా, ఓఎన్‌జీసీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఎన్‌టీపీసీ, బజాజ్ ఆటో తదితర కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. కాగా, టాటా స్టీల్, హిందుస్థాన్ లీవర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, మారుతీ, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ తదితర కంపెనీల వాటాలు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. మొత్తం మీద ఎన్నికల ఫలితాలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడడంతో స్టాక్ మార్కెట్ మళ్లీ బలోపేతమవుతున్నదని, రాబోయే రోజుల్లో సెనె్సక్స్ మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.