బిజినెస్

ఆర్‌బీఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆర్థికవేత్త శక్తికాంతదాస్ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ సోమవారం రాజీనామా చేసిన విషయం విదితమే. దీంతో శక్తికాంతదాస్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌గా కేంద్రం నియమించింది. ఈ పదవిలో ఆయన మూడేళ్లుంటారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఉన్న అపాయింట్స్‌మెంట్స్ కమిటీ శక్తికాంత దాస్ పేరును ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమాకానికి ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వంలో వివిధ సర్వీసుల్లో అపారమైన అనుభవం గడించిన శక్తికాంత దాస్ ఆర్థిక వ్యవహారాల్లో దిట్ట అని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఏఎన్ ఝా చెప్పారు. 1980 బ్యాచి తమిళనాడు క్యాడర్‌కు చెందిన ఆయన 2017 మే నెలలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. పెద్దనోట్ల రద్దు వ్యవహారాలను ఆయన పర్యవేక్షించారు. ప్రస్తుతం 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడుగా ఉన్నారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏలో డిగ్రీ పొందిన ఆయన సివిల్ సర్వీసు పరీక్షల్లో ఎంపికయ్యారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శక్తికాంత దాస్‌కు కేంద్ర రెవెన్యూ సర్వీసుల్లో కీలక బాధ్యతలు అప్పగించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానాన్ని కొంతకాలం సమీక్షించారు. గతంలో ఆర్‌బీఐ గవర్నర్‌గా పనిచేసిన డీ సుబ్బారావు కూడా ఐఏఎస్ అధికారిగా పనిచేసిన విషయం విదితమే. ఆర్‌బీఐ గవర్నర్లుగా ఐఏఎస్‌లను నియమించడం కొత్తకాదు.

చిత్రం..ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్