బిజినెస్

ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిలో కేంద్రం జోక్యం చేసుకోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 13: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వంలో భాగమని, ఈ వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ప్రభుత్వం రూపొందించిన ఆర్థిక దార్శనికతను ఆర్‌బీఐ అమలు చేస్తుందన్నారు. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తిని ప్రభుత్వం పరిరక్షిస్తుందన్నారు. రెండు రోజుల క్రితం ఆర్‌బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐలో కేంద్రం మితిమిరీన జోక్యం చేసుకుందని, అందుకే ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రం మాజీ ఐఎఎస్ అధికారి శక్తికాంతదాస్‌ను ఆర్‌బీఐ గవర్నర్‌ను నియమించిన విషయం విదితమే. ఆర్‌బీఐ స్వయంప్రతిపత్తితోనే తన విధులను నిర్వహిస్తుందని గడ్కరీ చెప్పారు. కాని ప్రభుత్వ ఆర్థిక దార్శనికతలో ఆర్‌బీఐ భాగమని ఆయన గుర్తుచేశారు. ఆర్‌బీఐ వ్యవస్థను నాశనం చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం వట్టిదేనని ఇదంతా దుష్ప్రచారమేనన్నారు. ప్రతి చోట కొన్ని అంశాల్లో అభిప్రాయబేధాలు ఉంటాయని, అంత మాత్రాన జోక్యం చేసుకున్నట్లుగా, వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నట్లుగా ప్రచారం చేయడం తగదన్నారు. రాజకీయ పరమైన జోక్యం ఎప్పుడూ చేసుకోలేన్నారు. ఆర్థిక వ్యవస్థ పారదర్శకంగా ఉండాలని, అవినీతి రహితంగా చేస్తున్నామన్నరు. ఆర్‌బీఐ సంపూర్ణ స్వేచ్చ కావాలంటే, అన్ని ఆర్థిక సమస్యలకు జవాబుదారీగా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు. అటువంటప్పుడు ఆర్థిక మంత్రిత్వశాఖ దేశ ఆర్థిక సమస్యలకు జవాబుదారీ వహించదంటే అంగీకరిస్తారా అని ఆయన ప్రశ్నించారు. స్వయంప్రతిపత్తి అంటే అన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. దేశంలో ఆర్థిక పరిస్థితికి ప్రభుత్వాన్నిబాధ్యత చేస్తే, ఆర్‌బీఐకు ఎందుకు సంబంధం ఉండదన్నారు. సుప్రీంకోర్టు మాదిరిగానే ఆర్‌బీఐ కూడా స్వయంప్రతిపత్తితో పని చేస్తుందన్నారు. కాని ఆర్‌బీఐ నూటికి నూరు శాతం ఆర్థిక విధానాలపై నిర్ణయం తీసుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. కొన్ని కంపెనీలు దురదృష్టవశాత్తు చిక్కుల్లో ఉంటే రక్షించాల్సిన బాధ్యత ఉందన్నారు. వాణిజ్య రంగంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి విజయమాల్యా గతంలో రుణం తీసుకుని 40 ఏళ్ల తర్వాత చెల్లించారన్నారు. అదే ఏవియేషన్ రంగం కోసం రుణం తీసుకున్న మాల్యా సమస్యల్లో చిక్కుకుని రుణాలు చెల్లించలేకపోయారన్నారు. నిజంగా మాల్యా, నీరవ్‌మోడీ దురుద్దేశ్యపూరితంగా అప్పులను ఎగగొడితే జైలుకు పంపాలన్నారు. కాని ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని ఆర్థిక నేరగాడని అంటే ఇక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందదన్నారు. మన బ్యాంకింగ్ వ్యవస్థ ఖాయిలా పడిన పరిశ్రమలకు ఆర్థిక సాయం చేయవన్నారు. నిరర్థక ఆస్తుల విలువ పెరిగేందుకు బ్యాంకులే కారణమన్నారు.

చిత్రం..కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ