బిజినెస్

చిన్న వ్యాపారాలకు ఊతం అభివృద్ధికి దిక్సూచి కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువస్తున్న నూతన వ్యాపార విధానాలతో చిన్న, మధ్యతరహా సంస్థలు ఆర్థికంగా బాగుపడుతున్నాయని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రతినిధిగా ఉన్న వేణుగోపాలా చారి అన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన బీఎన్‌ఐ క్యాపిటల్ ‘ మెగా బిజినెస్ మీట్’ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తెలంగాణలో ఉపాధి కల్పనకు పారిశ్రామిక వేత్తలను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే అభివృద్ధికి కేసీఆర్ దిక్చూచిగా నిలిచారని ఆయన అన్నారు. తెలంగాణలో బీఎన్‌ఐకి చెందిన పెట్టబడి దారులకు అన్ని రకాలుగా అవసరమైన సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు నీళ్ళు, భూములు, వౌలిక సదుపాయాలు, ఆర్థిక సహాయం తదితర విషయాలపై సానుకూలంగా ఉంటుందని అన్నారు. సుబ్బారావు మాట్లాడుతూ సూక్ష్మ,చిన్న మధ్య తరహా సంస్థలు అభివృద్ధికి, వికాసానిక బిఎన్‌ఐ ఒక అద్భుతమైన వేదిక అన్నారు. సంజనాషా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 77 దేశాల్లో 2.4 లక్షలకు పైగా సభ్యులతో 33 ఏళ్ళ నుండి ఒక రెఫరల్‌గా ఆర్గనైజేషన్‌గా బీఎన్‌ఐ ఖ్యాతికెక్కిందని అన్నారు.

చిత్రం..బీఎన్‌ఐ మెగా బిజినెస్ మీట్ సదస్సులో మాట్లాడుతున్న వేణుగోపాలాచారి