బిజినెస్

రైల్వే ప్రయాణికుల కోసం మొబైల్ యాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 15: రైల్వే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ‘రైల్ మదద్ ’ పేరుతో కొత్త మొబైల్‌యాప్‌ను తీసుకొచ్చారు. ప్రయాణంలో బోగీల్లో తమకు ఎదురవుతున్న సమస్యలతో పాటు అపరిశుభ్రంగా ఉన్నా వాటిని తమ మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీసి ‘రైల్ మదద్’ యాప్‌కు పంపవచ్చు. ప్రయాణికులు పంపిన సమాచారానికి అధికారుల నుంచి వెంటనే స్పందన ఉంటుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్‌లోంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైళ్లలో, స్టేషన్లలో జరిగే సంఘటనలు, సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణి కుడు పంపిన సమాచారంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలు సంబంధిత ఫోన్‌కు యూనిక్ ఐడీ ద్వారా సమాచారం వస్తుంది.
దేశంలో 17 రైల్వే జోన్‌లలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వేలో వివిధ సమస్యలపై ఇప్పటికే రైల్వే ట్విటర్ ఖాతాను తీసుకువచ్చింది. 138 నెంబర్‌తో సాధారణ హెల్ప్‌లైన్. భద్రత కోసం 182 నెంబర్. పిల్లల కోసం 1098. మహిళల కోసం 1091. రైలు ప్రమాదాలకు సంబంధించి 1072. కోచ్ శుభ్రం కోసం 58888. కేటరింగ్ ఫిర్యాదుల కోసం 1800111321. విజిలెన్స్ కోసం 155210 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. అదనంగా రైల్ మదద్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, ప్రయాణికులు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు.