బిజినెస్

సూచీల పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: సెలవుదినాలతో ముగిసిన వారంలో బెంచ్ మార్కుకన్నా దిగువన ట్రేడైన ఈక్విటీలు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాలను చవిచూశాయి. సోమవారం గృహనిర్మాణం, వినిమయ వస్తువులు, లోహ, ఆటోమొబైల్ కౌంటర్లలో షేర్ల అమ్మకాలు జోరుగా సాగాయి. గత వారం రోజుల నుంచి అంతర్జాతీయంగా మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు ఇందుకు దారితీశాయంటున్నారు. ప్రధానంగా అమెరికాలో రాజకీయ అనిశ్చితి సెంటిమెంటును బాగాప్రభావితం చేసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తొలుత కొంత సానుకూల పరిస్థితులతో స్వల్పంగా పెరిగి 35,910.67 కు చేరిన 30 షేర్ల సెనె్సక్స్ ఆ తర్వాత తలెత్తిన ప్రతికూలతలతో 35,432.24కు దిగువకుచేరి చివరినిమిషాల్లో 35,470.15 వద్ద ముగిసింది. ఈక్రమంలో సెనె్సక్స్ 271.92 పాయింట్లు నష్టపోయింది. అలాగే రోజు మొత్తం మీద 10,649.25 నుంచి 10,782.30 పాయింట్ల మధ్య ఊగిసలాడిన నిఫ్టీ చివరిగా 90.50 పాయింట్లు నష్టపోయి (0.84 శాతం నష్టంతో) 10,663.50 పాయింట్ల వద్ద ముగిసింది. మంగళవారం క్రిస్మస్ సందర్భంగా స్టాక్ ఎక్చేంజీలకు సెలవు. కాగా అంతర్జాతీయంగా మార్కెట్ల వ్యతిరేక సెంటిమెంటు, అమెరికాలో రాజకీయ అనిశ్చితి భారతీయ మార్కెట్లపై ప్రభావం చూపాయని ఎస్సెల్ మ్యూచువల్ ఫండ్ సీఐఓ విరాల్ బెరావాలా అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే మదుపర్లు లాభాల స్వీకరణపై దృష్టి నిలిపారని ఆయన తెలిపారు. అయితే డాలర్‌తో రూపాయి విలువ పెరగడంతోబాటు, ముడిచమురు ధరల్లో తరుగుల విదేశీ పెట్టుబడులకు ప్రోత్సాహవంతంగా మారే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. దేశీయంగా సంస్థాగత మదుపర్లు 488.55 కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మకాలు జరపగా, విదేశీ ఇనె్వస్టర్లు 134.14 కోట్ల రూపాయలను గత శుక్రవారం భారత మార్కెట్లలో మదుపుచేశారు. పాక్షికంగా అమెరికన్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొనడం అంతర్జాతీయంగా ఈక్విటీలను ప్రభావితం చేయగా క్రిస్మస్ తర్వాత ఈ పరిస్థితులు సానుకూలంగా మారే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే శీతాకాల పార్లమెంటు సమావేశాల నిర్ణయాలపై కూడా మార్కెట్ భవితవ్యం ఆధారపడి ఉంటుందంటుందని ఆర్థిక సలహాదారు హేమాంగ్ జానీ పేర్కొన్నారు. కాగా సెనె్సక్స్‌లో హీరోమోటో కార్ప్ షేర్లు అత్యధికంగా 4.27 శాతం నష్టపోయాయి. తర్వాత స్థానంలో 3.11 శాతం నష్టంతో బజాజ్ ఆటో నిలిచింది. వీటి తర్వాత ఎన్‌టీపీసీ 2.55 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.44 శాతం, వేదాంత 2.15 శాతం, ఆసియన్ పెయింట్స్ 2.13 శాతం, టాటా మోటార్స్ 2.05 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 2.10 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 1.33 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.28 శాతం వంతున నష్టపోయాయి. అలాగే కోల్ ఇండియా 1.19 శాతం, పవర్ గ్రిడ్ 1.12 శాతం, టాటా స్టీల్ 1.10 శాతం. ఎల్ అండ్ టీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఆర్‌ఐఎల్, ఓఎన్‌జీసీ, యెస్ బ్యాంకు, మారుతీ సుజుకీ, సన్ పార్మా, ఐసీఐసీ బ్యాంకు, ఐటీసీ సైతం 1.08 శాతం వరకు నష్టపోయాయి.
స్వల్ప లాభాల్లో ..
మార్కెట్ ప్రతికూల వాతావరణంలోనూ ఆరు సంస్థలు స్వల్ప లాభాలను ఆర్జించాయి. ఇందులో మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, కోటక్ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుమారు 1.03 శాతం లాభాలతో రోజును మిగించగా, పెరిగిన ముడిచమురు ధరల నేపథ్యంలో చమురు కంపెనీలు 3.33 శాతం నష్టం పోయాయి. ఇందులో ఐఓసీ, బీపీసీఎల్ ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు సోమవారం 1.04 శాతం పెరిగి బ్యారల్ 54.66 డాలర్లకు అమ్ముడైంది. జీఎస్టీ మండలి సమావేశంలో 33 అంశాలపై పన్ను స్లాబ్‌ను మార్చడం వల్ల మధ్య తరహా రంగాలే అధికంగా నష్టపోయాయి.