బిజినెస్

దేశవ్యాప్తంగా జీసీసీ మార్కెటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: దేశవ్యాప్తంగా అటవీ ఉత్పత్తుల అమ్మకాలను పెంచడం, విద్యావంతులైన గిరిజన నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జీసీసీ సేవలందిస్తోందని గిరిజన సంక్షేమ శాఖా మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అన్నారు. పలు రకాల అటవీ ఉత్పత్తులతో కూడిన మొబైల్ వ్యాన్‌ను మంత్రి సోమవారం సాయంత్రం ఇక్కడి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళారీ వ్యవస్థను సమూలంగా నిర్మూలించడం, గిరిజన రైతులకు గిట్టుబాటు ధర కల్పించి, నిరుద్యోగ గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం ద్వారా జీసీసీ వ్యాపారాన్ని సంస్థ అనూహ్యంగా పెంచుకోగలుగుతుందన్నారు. ఇందులోభాగంగా ప్రతి ఇంటికీ అటవీ ఉత్పత్తులు చేరాలనే సంకల్పంతో ఈ మొబైల్ సదుపాయాన్ని జీసీసీ అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. అన్ని రకాలైన అటవీ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా జీసీసీ వార్షికాదాయం ప్రస్తుతం రూ.307 కోట్ల మేర రాబడుతుండగా దీనిని రూ.520 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఇంతవరకు కుంకుళ్ళ చూర్ణం విక్రయించగా, కొత్తగా కుంకుళ్ళ రసంతో తయారు చేసిన షాంపూను అందుబాటులోకి తీసుకువచ్చిందని, ప్రకృతి సిద్ధమైన పసుపు, రాజమాల్ చిక్కుళ్ళు, పలు రకాలైన సబ్బులు, కాఫీ, కొత్తగా వేపిన జీడిపప్పు, మల్ట్ఫీల్ బిస్కట్లు మొబైల్ ద్వారా అమ్మకాలు పెంచుకుంటుందన్నారు.
జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ టీ.బాబూరావునాయుడు మాట్లాడుతూ దేశంలో పలు కాస్మోటిక్ నగరాల్లో తమ సంస్థ మార్కెటింగ్ వ్యవస్థను మరింతగా పటిష్టపరుస్తుందని, ఇందులోభాగంగా తిరుపతి అలిపిరి, ఆంధ్రా రాజధాని అమరావతి సెక్రటేరియట్‌లో విజయవాడ భవానీ ఐల్యాండ్, మంగళగిరి జీసీసీ రీజనల్ ఆఫీసు, చింతూరు ఐటీడీఏ, విశాఖ విమానాశ్రయం, దుంబ్రిగుడ, విజయవాడ రైతుబజారు, నాబార్డు రూరల్ మార్క్ తదితర చోట్ల కొత్తగా రిటైల్ ఔట్‌లెట్స్‌ను ప్రారంభించామన్నారు. అలాగే ఏలూరు, శ్రీకాకుళం రైతుబజార్లు, విశాఖ సిటీ సెంట్రల్‌బ్యాంక్, జీ.మాడుగుల కొత్తపల్లి వాటర్‌ఫాల్స్, లంబసింగి టూరిస్టు ప్రాంతం, దుంబ్రిగుడ ప్రాంతాలతోపాటు న్యూఢిల్లీ ఏపీ భవన్‌లో త్వరలో కొత్త ఔట్‌లెట్స్ అందుబాటులోకి వస్తున్నాయన్నారు. న్యూఢిల్లీ, రాజమండ్రి ప్రాంతాల్లో మొబైల్ వెండింగ్ ద్వారా, తిరుపతి అలిపిరి (తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ)ల ద్వారా త్వరితగిన జీసీసీ ఔట్‌లెట్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
చిత్రం..కొత్తగా అందుబాటులోకి వచ్చిన అరకు కాఫీ ప్యాకెట్‌ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రావణ్‌కుమార్