బిజినెస్

చర్యలు ఫలిస్తాయా?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: అధికారాలను దుర్వినియోగం చేసి, కొన్ని కంపెనీలకు వందల, వేలాది కోట్ల రూపాయల రుణాలను ఉదారంగా ఇచ్చేసి, ఆతర్వాత రుణాల ఎగవేతల కారణంగా బ్యాంకుల నష్టానికి కారణమైన అధికారులు, సిబ్బందిపై తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తాయా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నది. ఈ విధంగా ప్రభుత్వ రంగంలోని బ్యాంకులను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దెబ్బతీసిన ఆరు వేల మందికిపైగా అధికారులు, ఉద్యోగుల మీద చర్యలు తీసుకున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది. చర్యలు తీసుకున్న అధికారులపై భారీగా జరిమానాలు విధించినట్టు కూడా జైట్లీ ప్రకటించారు. అయితే, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారు ఎగ్గొట్టిన వేలాది కోట్ల రూపాయలను వీరి నుంచి కేంద్రం రాబట్టగలుగుతుందా? వారు కోర్టులను ఆశ్రయిస్తే, కేసులు ఎంతకాలం కొనసాగుతుంది? ఈ ప్రకటన వల్ల ప్రజలను ఒరిగేది ఏమిటి? చేజారిన వేలాది కోట్ల రూపాయల మాట ఏమిటి? ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని ఎందుకు కఠినంగా శిక్షించడం లేదు? విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను తిరిగి రప్పించడంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతున్నది? ఇలాంటి ప్రశ్నలకు కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానం రావాల్సి ఉంది. కానీ, జైట్లీ ప్రకటన ఇలాంటి ఏ ఒక్క ప్రశ్నకు కూడా జవాబు చెప్పలేదు. ఆరువేలకుపైగా ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నామని ప్రకటించి, చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. నిజానికి ఈ బ్యాంకులు ఇచ్చిన రుణాలను రాబట్టుకునే దిశగా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.