బిజినెస్

ఫోరెన్సిక్ ఆడిట్‌కు హైదరాబాద్ సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: వివిధ సంస్థలు సమర్పించిన ఆర్థిక వాంగ్మూలాలకు (ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్)కు ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించేందుకు హైదరాబాద్‌కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ శరత్ అండ్ అసోసియేషన్‌ను సెక్యూరిటీస్ అండ్ ఎక్చేంజ్ బోర్ట్ ఆఫ్ ఇండియా (సెబీ) ఎంపిక చేసింది. దీంతో ఈ సెబీ ఎంపిక చేసిన ఇలాంటి సంస్థలు పదికి చేరుతా యి. వాంగ్మూలాలను శరత్ అండ్ అసోసియేషన్ లోతుగా పరిశీలించి అందులో మోసాలు తలెత్తకుండా చూస్తుందని సెబీ వివరించింది. ఇప్పటికే సెబీ ఎంపిక చేసిన జాబితాలో కేపీఎంజీ, గ్రాంట్ థామ్టన్, ఇఆర్‌ఎన్‌ఎస్‌టీ అండ్ యంగ్ అసోసియేట్స్ ఎల్‌ఎల్‌పీ, డెలాయిట్ టౌచే తోహమట్సు ఇండియా లిమిటెడ్ ఎల్‌ఎల్‌పీ, చోక్షీ అండ్ చోక్షీ ఎల్‌ఎల్‌పీ, జీడీ ఆప్టే అండ్ కో సీఏ, జేఎల్‌ఎన్ యూఎస్ అండ్ కో, పిపారా అండ్ కో ఎల్‌ఎల్‌పీ, టీఆర్ చధా అండ్ కో ఎల్‌ఎల్‌పీ సంస్థలను గత అక్టోబర్‌లో ఎంపిక చేసింది.