బిజినెస్

తగ్గిన పసిడి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: వరుసగా మూడు రోజుల పాటు లాభాలు పంచి న పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. వారాంతంలో పది గ్రాముల బంగారం ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 32,690 రూపాయలు పలికింది. డాలర్‌తో రూ పాయి విలువ తగ్గడం ఇందుకు కారణమని ఆలిండియా సరాఫా అసోసియేషన్ తెలిపింది. కాగా వెండి ధరల పెరుగుదల నమోదైంది. కిలో 40 వేల నుం చి 40,140కి పెరిగింది. పరిశ్రమ విభాగాలు, నాణాల మార్కెట్ నుంచి పెరిగిన డిమాండ్‌తో వెండి కిలో పై మొత్తం రూ.440 లాభ పడింది. భారత రూపాయితో పోలిస్తే డాలర్ విలువ బలహీన పడటం, స్థానిక జ్యువలరీ వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడం బంగారం ధరపై ప్రభావం చూపిందని సరాఫా అసోసియేషన్ విశే్లషించింది. కాగా, గడిచిన నాలుగు రోజులుగా బంగారం ధరలు రూ.565 పెరిగాయి. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర రూ.145 తగ్గి తులం రూ.32,690 పలికింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛమైన బంగారం 32,540 వద్ద ట్రేడ్ అయింది. అయితే సవరం (8 గ్రాములు) బం గారం విలువలో మాత్రం మార్పు లే దు. సవరం బంగారం రూ. 25,200 ధర పలికింది. అంతర్జాతీయ మా ర్కె ట్లో ఔన్స్ బంగారం ధర రూ. 1293.61 అమెరికన్ డాలర్లతో లాభాల్లోనే ట్రేడైం ది. న్యూయార్క్‌లో ఔన్స్ ధర 15.75 డాలర్లు పెరిగింది. అలాగే వెండి ధర 440 రూపాయలు పెరిగింది. వారానికి జరిగే సరఫరాను దృష్టిలో ఉంచుకుంటే వెండి నాణేల ధర కిలోపై 71 రూపాయలు పెరిగి 39,436 రూపాయలు పలికింది. వంద పీసుల వెండి కొనుగోళ్లలో రూ.76 వేలు, అమ్మకాల్లో రూ.77 వేల వంతున పలికింది.