బిజినెస్

ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు రూ.1500 కోట్ల రుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 5: ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో మునిగితేలుతున్న దేశంలోని పెద్ద విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ భారీ రుణం కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)ని ఆశ్రయిస్తోంది. అప్పుల నుంచి బయటపడేందుకు 1500 కోట్ల రూపాయలు (215 మిలియన్లు) రుణం రూపేణా అందజేయాలని తాజాగా ఎస్‌బీఐని అభ్యర్థించిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఈమేరకు ఈనెల 8న సంబంధిత రు ణదాతలతో, ఎస్‌బీఐ అధికారవర్గాలతో సమావేశం నిర్ణయించనుంది. బ్యాంకు నుంచి వచ్చే రుణంతో సంస్థ పునరుద్ధరణ, పైలెట్లకు బకాయి పడిన జీతా లు, ఇతర సంస్థలు బకాయిల చెల్లింపుల ప్రక్రియ చేపట్టేందుకు వీలుంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. రుణదాతలతోపాటు విదేశాల నుంచి ఆర్థి క సాయం అందించేందుకు వచ్చే సంస్థలతోపా టు వ్యక్తులకు తిరిగి రుణం చెల్లించే ప్రక్రియపై సమగ్రంగా ఆ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. దేశంలో విమాన ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నా దేశవాళీ మార్కెట్‌లో ఎదురవుతున్న మిగిలిన విమానయాన సంస్థల నుంచి ఎ దురవుతున్న పోటీని తట్టుకునేందుకు జెట్ ఎయిర్‌వేస్ భారీగానే నిధులను వెచ్చిస్తూ వస్తోంది. కా గా, రుణదాతలు ఇచ్చే ఆర్థిక సహాయం జెట్ ఎయిర్‌వేస్‌లు నడిపేందుకు మాత్రమే ఉపకరిస్తాయని, కానీ ఈ నిధులు సంస్థ ఎదుర్కొంటున్న నిధుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. ప్రస్తుతం 124 ఎయిర్‌క్రాఫ్ట్‌లను నడుపుతున్న జెట్ ఎయిర్‌వేస్ వీటిలో చాలావరకు లీజులకు ఇచ్చింది. కాగా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈనెల 7న జెట్ ఎయిర్‌వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌తో సమావే శం కానున్నారు. ఈ సమావేశంలో సంస్థ నిధులు సమకూరడంతో పాటు పైలెట్లకు బకాయి పడిన జీతాలు, వివిధ రూపాల్లో చెల్లించాల్సిన బకాయిలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.