బిజినెస్

ద్రవ్యలోటు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 7: ప్రస్తుతం దేశానికి అవసరమైన మేరకు కరెన్సీని అందుబాటులో ఉంచామని, ఒకవేళ ఆర్థిక రంగంలోద్రవ్యలోటు ఏర్పడే పక్షంలో సెంట్రల్ బ్యాంకు దానిపై చర్యలు తీసుకుంటుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం నాడిక్కడ స్పష్టం చేశారు. ముంబైలో మంగళవారం తాను నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అవుతానని, ఆ కంపెనీలకు తలెత్తుతున్న ద్రవ్యలోటు సమస్యపై చర్చిస్తానని ఆయన తెలిపారు. ఇప్పటికే ఈ రంగంలో ద్రవ్య లభ్యతపై సమగ్రంగా మానిటర్ చేస్తున్నామని, ఒకవేళ ద్రవ్యలోటు తలెత్తితే ఆ సమస్యను పరిష్కరించేందుకు రిజర్వుబ్యాంకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అదే సమయంలో ద్రవ్యలభ్యత కారణంగా ధన నష్టాన్ని చవిచూసేందుకు రిజర్వుబ్యాంకు సిద్ధంగా లేదని దాస్ చెప్పారు. ద్రవ్యలభ్యతను పెంచేందుకు అదనంగా ధనాన్ని సమకూర్చే సమయంలో అత్యంత జాగరూకతతో వ్యవహరిచాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. అదనపుద్రవ్యలభ్యత కొన్ని అనర్థాలకు దారితీసే ప్రమాదం ఉందని తెలిపారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ)ల ప్రతినిధులతో సమావేశమైన అనంతరం రిజర్వు బ్యాంకు గవర్నర్ దాస్ విలేఖరులతో మాట్లాడారు. ద్రవ్య లభ్యతకు సంబంధించి ఎంఎస్‌ఎంఈల ప్రతినిధులు ఏమైనా మీ దృష్టికి తెచ్చారా? అని దాస్‌ను విలేఖరులు ప్రశ్నించగా ఇది ప్రత్యేకించి ఓ రంగానికే పరిమితం కాదన్నారు. మార్కెట్‌కు సంబంధించిన అంశమని, ఈ సమయంలో తానేమి చెప్పినా మార్కెట్ స్థితిగతులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సమాధానం ఇచ్చారు. వివిధ కంపెనీలు, పెట్టుబడిదారుల అవసరాలను తెలుసుకున్న అనంతరం ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (ఓఎంఓ)కు అదనంగా 60 వేల కోట్ల రూపాయలను గత డిసెంబర్, ప్రస్తుత జనవరి మాసాలకుగాను రిజర్వు బ్యాంకు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్థిక సంస్ధలకు సంబంధించినంత వరకు ద్రవ్యలోటును పూర్తిగా భర్తీ చేయడం జరిగిందన్నారు. తదుపరి కూడా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్‌బీఎఫ్‌సీ) ప్రతినిధులతో సమావేశాలు కొనసాగిస్తామని గవర్నర్ తెలిపారు. మంగళవారం వీరితో జరిగే సమావేశంలో అన్ని సమస్యలపై సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. గత నెలలో కొత్త గవర్నర్ ప్రభుత్వ రంగ, ప్రైవేటు, సహకార బ్యాంకుల అధికారులతో సమావేశమైన సంగతి తెలిసిందే. కాగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సమస్యలపై సోమవారం (ఎంఎస్‌ఎంఈ) ప్రతినిధుల సమావేశంలో ఇటీవల రిజర్వుబ్యాంకుప్రకటించిన రుణాల పునర్వ్యవస్థాపక పథకాలను గురించి చర్చించడం జరిగిందని ఆయన చెప్పారు. మొత్తం రెండు గంటలపాటు జరిగిన ఈ చర్చలు తనకెంతో ఉపయుక్తంగా ఉంటాయని భావిస్తున్నాని గవర్నర్ దాస్ తెలిపారు. ఎంఎస్‌ఎంఈల మానసిక స్థితిని మాత్రం తాను గోప్యంగా ఉంచదలిచానని ఆయన స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈల్లో ద్రవ్యలోటు సమస్యను పరిష్కరించేందుకు గత వారం ఆర్బీఐ రూ. 25 కోట్ల వరకు గల మొండి రుణాలను ఏకదఫా పునర్వ్యవస్థీకరించేందుకు అనుమతించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనిపై అత్యధిక శాతం సంస్థలు లబ్ధిపొందేలా చూసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మార్గదర్శకాలను రూపొందించి ఆర్బీఐ బోర్డు ముందుంచాల్సిందిగా బ్యాంకులను కోరామని దాస్ చెప్పారు.

చిత్రం..సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్