బిజినెస్

ఎరువులు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల్లో భారత్ పెట్టుబడులకు ఇరాన్ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 8: భారత్‌తో సంబంధాలను బలోపేతం చేసుకోవడంలో భాగంగా యూరియా, పెట్రోకెమిక ల్స్ పరిశ్రమల్లో పెట్టుబడులను ఇరాన్ ఆహ్వానించింది. ఎరువులను తమ దేశ ప్రజలకు న్యాయమైన ధరలకు అందించేందుకు ఇరాన్ కృషి చేస్తోందని, ఇందులో భాగంగా భారతీయ పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలను ఆ దేశం ఆహ్వానించిందని ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి మొహమ్మద్ జావేద్ జారిఫ్ తెలిపారు. మంగళవారం నాడిక్కడ ఆయన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై చర్చలు జరిపిన అరంతరం విలేఖరులతో మాట్లాడారు. తమ దేశంలోని చాబహార్ ప్రాంతంలో ఎరువులు, పెట్రోకెమికల్స్ పరిశ్రమల్లో పెట్టుబడులకు భారత్ పెట్టవచ్చని జారిఫ్ తెలిపారు. దీర్ఘకాలంగా భారత్ ఇరానియన్ యూరియా ఎరువులకు వినియోగదారుగా ఉంటున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా అనుచిత ఆంక్షల కారణంగా భారత వినియూగదారులు, రైతులు 38 శాతం అదనంగా ధరలు పెట్టి ఎరువులు కొనుగోలు చేయాల్సివస్తోందని, ఈ సమస్యను అధిగమించి న్యాయమైన ధరలకు భారతీయ రైతులకు ఎరువులు అందించాలని భావిస్తున్నామని ఇరాన్ విదేశాంగ మంత్రి తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య కార్యక్రమాలు నెమ్మదించాయని, ఈ క్రమంలోనే భారత్, చైనా, రష్యాలాంటి సాంస్కృతిక భాగస్వాములతో బంధం బలోపేతం చేసుకునేందుకు ఇరాన్ కృషి చేస్తోందని ఆయన చెప్పారు. ఇందులో తమదేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. టెహ్రాన్‌కు మంజూర్ల విషయంలో అమెరికా ఆంక్షలు కొనసాగుతున్న క్రమంలో యూరోపియన్‌తో బంధాల విషయంలో వేచిచూడ కూడదని నిర్ణయించామన్నారు. 2015లో టెహ్రోన్‌తో జరిగిన అణు చర్చల నేపథ్యంలో అమెరికా యూరోపియన్ దేశాలపై ఆంక్షలు విధించిన విషయాన్ని జారిఫ్ గుర్తు చేస్తూ ప్రస్తుతం తిరిగి తమ దేశంతో వాణిజ్య సంబంధాలపై యూరోపియన్ దేశాలు చెల్లింపుల విషయంలో సరికొత్త ప్రణాళికలు రూపొందించుకునే విషయంలో నిర్లిప్తంగా వ్వవహరిస్తున్నాయని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో ఇరాన్ బ్యాంకులకు కోత విధించాలని, చమురు ఎగుమతులు తగ్గించి వేయాలని అమెరికా భావిస్తోందని ఆయన చెప్పారు. కాగా భారత్-ఇరాన్ దేశాలు అవసరాల అనుగుణంగా పరస్పర సహకారం కొనసాగిస్తాయని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.