బిజినెస్

చిన్న వర్తకులకు శుభవార్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 10: చిన్న వర్తకులకు శుభవార్త. ఇంతకాలం వార్షిక టర్నోవర్ రూ.20 లక్షలుంటే వస్తు సేవా పన్నును చెల్లించే పరిమితిని రూ.40 లక్షలకు పెంచుతూ వస్తు సేవా పన్ను మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే కాంపోజిషన్ స్కీం కింద ఉన్న గరిష్టపరిమితిని రూ.1.5 కోట్లకు పెంచారు. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. గురువారం వస్తుసేవా పన్ను మండలి సమావేశం జరిగింది. కేరళలో ప్రకృతి విపత్తు సంభవించిన దృష్ట్యా అంతరాష్ట్ర వస్తువులు, సరకుల రవాణాపై ఒక శాతం సెస్సు విధించేందుకు అనుమతించారు. రెండేళ్లపాటు సెస్సును విధించవచ్చని అరుట్ జైట్లీ చెప్పారు. వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల వరకు ఉన్న వర్తకులకు తాజా నిర్ణయం వల్ల ఊరట చెందుతారని
అన్నారు. రూ.40 లక్షల వరకు టర్నోవర్ ఉన్న వర్తకులు వస్తు సేవా పన్నును చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈశాన్య రాష్ట్రాల్లో జీఎస్‌టీ చెల్లింపునకు గరిష్టటర్నోవర్ రూ.20 లక్షలు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వార్షిక టర్నోవర్ రూ.20లక్షలున్న వర్తకులు, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.10 లక్షలు టర్నోవర్ ఉన్న వర్తకులు జీఎస్‌టీ పరిధిలో ఉండేవారు. ఈ పరిమితిని పెంచడం వల్ల చిన్న వర్తకులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి చెప్పారు. గరిష్టపరిమితిని రెట్టింపు చేయడం వల్ల ప్రభుత్వానికి సాలీనా రూ.5200 కోట్ల ఆదాయం తగ్గుతుంది. కాంపొజిషన్ స్కీం కింద పరిమితిని రూ.1.5 కోట్లకు పెంచడం వల్ల వర్తకులకు ఉపయోగంగా ఉంటుందన్నారు. జీఎస్‌టీలో చేసిన మార్పులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయన్నారు. రూ.50 లక్షల వరకు టర్నోవర్ ఉన్న సర్వీసు ప్రొవైడర్లు, సప్లయర్లు జీఎస్‌టీ కాంపోజిషన్ స్కీంను ఎంపిక చేసుకోవచ్చని అన్నారు. వారు ఆరుశాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల సాలీనా రూ.3000 కోట్ల ఆదాయం తగ్గుతుంది. చిన్న, మధ్య వర్తకులు, పరిశ్రమల యాజమాన్యాలకు లబ్ధి చేకూరే విధంగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని జైట్లీ వివరించారు.
రియల్ ఎస్టేట్‌పై జీఎస్‌టీ విధించడంపై ప్రతిపాదనలను ఏడుగురు సభ్యుల గ్రూపు తీసుకుంటుందన్నారు. ఈ గ్రూపులో వివిధ రాష్ట్రాల మంత్రులు సభ్యులుగా ఉన్నారని అన్నారు. కాంపొజిషన్ స్కీం పరిధిలోకి వచ్చిన వారు ప్రతి మూడు నెలలకోసారి పన్నులను చెల్లించాలని, సాలీనా ఒక పన్ను రిటర్న్‌ను దాఖలు చేయాల్సి ఉంటుందని అరుణ్ జైట్లీ చెప్పారు. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ మాట్లాడుతూ వార్షిక టర్నోవర్ రూ.20 లక్షల లోపు ఇంతకాలం ఉండేదని, 10.93 లక్షల మంది పన్నులు చెల్లిస్తున్నారన్నారు. జీఎస్‌టీ కింద రూ.1.17 కోట్ల మంది వర్తకులు నమోదై ఉన్నారన్నారు. జీఎస్‌టీ 2017 జూలై 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
చిత్రం..ఢిల్లీలో గురువారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ భేటీలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ