బిజినెస్

వృద్ధిపథంలో నవ్యాంధ్ర టూరిజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 28: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం వృద్ధిపథంలో దూసుకెళ్తోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో గత ఏడాది నవ్యాంధ్రకు పర్యాటకులు 30 శాతం అధికమయ్యారు. సముద్ర తీర అందాలు, ప్రాచీన దేవాలయాలు, కొండ ప్రాంతాలు, జలపాతాలతో ప్రకృతి రమణీయ దృశ్యాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్‌కు 2015లో 12 కోట్ల 18 లక్షల 30 వేల మంది పర్యాటకులు వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు చెబుతున్నాయి. 2014లో 9 కోట్ల 33 లక్షల మంది పర్యాటకులు వచ్చినట్లు తెలిపింది.
‘దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలపాలన్న మా లక్ష్యానికి తాజా గణాంకాలు గొప్ప ప్రోత్సాహాన్నిచ్చాయి.’ అని ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ‘రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వివిధ ప్రాంతాలను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నాం. ఈ విషయంలో వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నాం. ఏటేటా పర్యాటకుల తాకిడి మరింతగా పెరుగుతుంది.’ అన్న ఆశాభావాన్ని ప్రసాద్ వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్‌ను పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇదిలావుంటే అనంతపూర్ జిల్లాలోగల పుట్టపర్తి, లేపాక్షి వద్దనున్న వీరభద్ర దేవాలయానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగింది. ఇక్కడికి గత ఏడాది అత్యధికంగా విదేశీ పర్యాటకులు రాగా, వారు 1.37 లక్షలుగా ఉన్నారు. ఇక మొత్తం గత ఏడాది రాష్ట్రానికి 2.37 లక్షల మంది విదేశీ పర్యాటకులు వచ్చారు. 2014లో ఈ సంఖ్య 66,333గానే ఉంది. సింగపూర్, మలేసియా, మధ్య ప్రాచ్య తదితర ఆగ్నేయాసియా దేశాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చారు.