బిజినెస్

స్వల్ప లాభాలతో సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 4: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)కు ఎట్టకేలకు రాజ్యసభ ఆమోదం తెలపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాల నుంచి కోలుకోగలిగాయి. అయితే స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. ఆటో, రియల్టీ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పవర్, హెల్త్‌కేర్ రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించినప్పటికీ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటి, బ్యాంకింగ్, ఎఫ్‌ఎమ్‌సిజి రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 16.86 పాయింట్లు కోలుకుని 27,714.37 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 6.25 పాయింట్లు అందుకుని 8,551.10 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్, చైనా సూచీలు లాభాల్లో ముగిశాయి.