బిజినెస్

పసిడికి సంక్రాంతి మెరుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 14: పసిడి ధర దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పది గ్రాములపై 225 రూపాయలు పెరిగింది. మొత్తం ధర రూ.33,100 పలికింది. పండుగ సీజన్ కావడంతో స్థానిక వ్యాపారుల నుంచి డిమాండ్ పెరగడంతోబాటు, అంతర్జాతీయ మార్కెట్‌లో సైతం సానుకూల పరిస్థితులు నెలకొనడం బులియన్ మార్కెట్‌కు ఊతమిచ్చిందని విశే్లషకులు భావిస్తున్నారు. అలాగే వెండి ధరల్లో సైతం పెరుగుదల నమోదైంది. కిలో వెండి ధర రూ.250 పెరిగి 40.100కు చేరింది. ప్రత్యేకించి పారిశ్రామిక విభాగాల నుంచి, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడం వెండి ధర పెరిగేందుకు దోహదం చేసిందని అంచనావేస్తున్నారు. అమెరికన్ డాలర్‌తో రూపాయి ధర తగ్గినప్పటికీ మార్కెట్ల డిమాండ్‌తో బంగారు, వెండి ధరలు పెరిగాయంటున్నారు. కాగా అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1,290.22 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.73 డాలర్లు వంతున పలికింది. ఇక మన రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం పది గ్రాములపై 225 రూపాయలు పెరిగి రూ.33,100 పలికింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛ బంగారం ధర 32,950గా పలికింది. ఇక సవరం (ఎనిమిది గ్రాములు) బంగారం ధర రూ.100 పెరిగి రూ.25,400 పలికింది. ఇక ప్రతి వారం పద్ధతిలో సరఫరా చేసే వెండి కిలోధర రూ.39.617 పలికింది. ఇక వెండి నాణేలు ధరలో పెద్దగా మార్పేమీ కనిపించలేదు. వంద పీసుల వెండి కొనుగోలు ధర రూ.77వేలు, విక్రయ ధర రూ.78 వేల వంతున పలికింది.