బిజినెస్

జిఎస్‌టితో జిడిపి పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 4: సుదీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలపడంపట్ల పారిశ్రామిక, వ్యాపార రంగం ఆనందం వ్యక్తం చేసింది. ఈ పరోక్ష పన్ను సంస్కరణ ద్వారా భారత్‌కు విదేశీ మదుపరులు పోటెత్తుతారని, ఉత్పాదక రంగం కార్యకలాపాలు పెరుగుతాయని, దీంతో దేశ జిడిపి కనీసం 2 శాతమైన వృద్ధి చెందుతుందని అభిప్రాయపడింది. ‘జిడిపితో ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆర్థిక క్రమశిక్షణకు ఆస్కారముంటుంది. ఉత్పాదకత పెరిగి, పారదర్శకత కనిపిస్తుంది.’ అని హిందుజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండియా చైర్మన్ అశోక్ పి హిందుజా అన్నారు. దశాబ్దాల కాలం నుంచి గమనిస్తే జిఎస్‌టి ఓ మైలురాయి అని పేర్కొన్నారు. ‘జిఎస్‌టి అమలైతే దేశంలోని కేంద్ర, రాష్ట్ర పన్నులు, సుంకాల్లో చాలావరకు రద్దవుతాయి. ఒకే మార్కెట్‌గా ఏర్పడే జాతీయ మార్కెట్ దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టిస్తుంది.’ అని పారిశ్రామిక సంఘం సిఐఐ అధ్యక్షుడు నౌషద్ ఫోర్బ్స్ అన్నారు. జిఎస్‌టి అమలుతో 2019-20 ఆర్థిక సంవత్సరం నాటికి దేశ జిడిపి వృద్ధిరేటు 10 శాతానికి చేరగలదని పిహెచ్‌డి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు మహేశ్ గుప్తా అంచనా వేశారు. యెస్ బ్యాంక్ ఎండి, సిఇఒ రాణా కపూర్ మాట్లాడుతూ ‘జిఎస్‌టి దేశంలో వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిపథంలో నడిపిస్తుంది. పన్ను విధానాలు సరళతరమవుతాయి. ఉత్పాదక రంగం పుంజుకుంటుంది.’ అన్నారు. అలాగే జిఎస్‌టి అమలుతో ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తుల ధరలు కనీసం 10 శాతమైన తగ్గుతాయని చార్టర్డ్ అకౌంటెంట్స్ అత్యున్నత సంఘం ఐసిఎఐ అంచనా వేసింది. లాజిస్టికల్ భారం తగ్గుతుందని, ఎలక్ట్రానిక్, గృహోపకరణాల తయారీదారులకు కలిసొస్తుందని పానసోనిక్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు, సిఇఒ మనీష్ శర్మ అన్నారు. జిఎస్‌టిని ఓ మంచి నిర్ణయంగా అభివర్ణించింది కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లియెనె్సస్ తయారీ సంఘం (సిఇఎఎమ్‌ఎ). మరోవైపు ఇంజినీరింగ్ ఎగుమతుల సంఘం ఇఇపిసి ఇండియా చైర్మన్ టిఎస్ భాసిన్ స్పందిస్తూ భారత తయారీదారులు, ఎగుమతిదారులు జిఎస్‌టి అమలుతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఐటి సంఘం నాస్కామ్ కూడా జిఎస్‌టితో ఐటి రంగం ప్రతికూల పరిస్థితులనే ఎదుర్కోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. జిఎస్‌టి అమలు నేపథ్యంలో ఎగుమతులకు ప్రోత్సాహకాలుండాలని, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూతనివ్వాలని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్‌ఐఇఒ) అధ్యక్షుడు ఎస్‌సి రల్హన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి అతిపెద్ద సంస్కరణగా చెప్పుకుంటున్న జిఎస్‌టి బిల్లుకు.. ఎన్నో ఆటంకాలు, మరెన్నో సవరణల అనంతరం బుధవారం రాజ్యసభ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినది తెలిసిందే. దీంతో ఇప్పటికే లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ సవరణల కారణంగా మరోసారి లోక్‌సభకు బిల్లు వెళ్ళాల్సి ఉండగా, మోదీ సర్కారుకు కావాల్సినంత మెజారిటీ ఉండటంతో అది లాంఛనమే అయ్యింది. ఈ బిల్లును వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

ఎవరేమన్నారు

‘జిఎస్‌టి ఓ చారిత్రక నిర్ణయం. ఓ గొప్ప మైలురాయికి బీజం పడింది. భారత్ ఇక తమ ఆర్థిక ప్రగతి అవరోధాలను అధిగమిస్తుంది. అంతర్రాష్ట్ర పన్ను విధానాల భారం తగ్గుతుంది.’
- అమెరికా-్భరత్ వ్యాపార మండలి
‘దేశ ఆర్థిక వృద్ధికి జిఎస్‌టి అమలు ఎంతో కీలకం. జిఎస్‌టి ద్రవ్యోల్బణంపై ఎలాంటి ప్రభావం చూపబోదు. చాలా సంస్కరణలు మందగమనంలో ఉన్నాయి. వాటిని కూడా త్వరగా అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.’
- గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్
‘్భరతీయ మార్కెట్లకు జిఎస్‌టితో ఎంతో ప్రయోజనం. దేశ ఆర్థిక వ్యవస్థకు శుభశకునం. వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆలస్యం తగదు.’
- డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్
‘జిఎస్‌టి విజయం.. దాని అమలుపైనే ఆధారపడి ఉంది. ఎంత త్వరగా దీన్ని అమల్లోకి తీసుకువస్తే అంత మంచి జరుగుతుంది. మార్కెట్‌ను ఏకం చేయడమేగాక పన్నుల భారాన్ని తగ్గిస్తుంది.’
- మారుతి సుజుకి
‘దేశ ఆర్థిక వ్యవస్థను జిఎస్‌టి బలోపేతం చేస్తుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ భారత్‌ను ప్రధాన పోటీదారుగా నిలబెడుతుంది. ఎనె్నన్నో అవకాశాలకు జిఎస్‌టి ప్రవేశద్వారం లాంటిది.’
- హీరో మోటోకార్ప్
‘ఆటో రంగంలో ప్రస్తుతమున్న పన్ను విధానాల్లోగల తేడాలను జిఎస్‌టితో హేతుబద్ధీకరించవచ్చు. నిజంగా ఆటో రంగానికి జిఎస్‌టితో మేలు జరుగుతుంది.’
- హోండా కార్స్ ఇండియా
‘ఆటో రంగంతోపాటు చాలా రంగాలకు జిఎస్‌టి అనుకూలం. పన్నుల భారం తగ్గుతుంది. అమ్మకాలు కూడా పెరుగుతాయనిపిస్తోంది. వినియోగదారులకూ జిఎస్‌టి ప్రయోజనాలు అందాలి.’
- రెనాల్ట్ ఇండియా
‘ఈ చారిత్రక బిల్లు అమలుతో దేశ జిడిపి వృద్ధికి ఆటో రంగం కూడా కీలకమవుతుందని నేను నమ్ముతున్నాను. ఒకే దేశం, ఒకే పన్ను విధానంతో ఎన్నో లాభాలున్నాయి.’
- ఫోర్డ్ ఇండియా