బిజినెస్

రైతులకు రిమోట్ పంపుసెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 6: విద్యుత్ ఆదాతోపాటు రైతులకు సౌకర్యంగా ఉండే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక వ్యవసాయ రిమోట్ పంపుసెట్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. విద్యుత్ మోటార్లకు సంబంధించి రైతులు అనేక విధాలుగా ఎదుర్కొనే సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. కర్షకుల కష్టాలెరిగి, వారి సంక్షేమమే లక్ష్యంగా, అన్ని విధాల సౌకర్యంగా ఉండే పంపుసెట్లు పొలాల్లో బిగించాలని తలంచింది.
ఈ పంపుసెట్ల వల్ల 27 శాతం విద్యుత్ ఆదా అవుతుందని గుర్తించారు. ఈ సెట్లను బిగిస్తే, దాన్ని ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి రైతు రాత్రి వేళల్లో పొలం వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంటి వద్ద నుంచే సెల్‌ఫోన్ ద్వారా ఆ మోటార్‌ని ఆఫ్, ఆన్ చేయవచ్చు.
దీని విలువ 60వేల రూపాయల వరకు ఉంటుంది. ఎంత హార్స్ పవర్ మోటార్ కావాలో రైతు కోరిన ప్రకారం పంపుసెట్లు అందజేస్తారు. మోటారు మరమ్మతుల కోసం రైతులు పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చిస్తుంటారు. ఈ మోటారును ఉచితంగా ఇవ్వడమే కాకుండా, ఐదేళ్లపాటు దాని మరమ్మతుల బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అన్నదాతలకు ప్రభుత్వం ఇచ్చే గొప్ప వరం ఇది. ప్రభుత్వం రాష్టమ్రంతటా ఎల్‌ఈడి బల్బులను అమర్చి, 20వేల మెగావాట్ల విద్యుత్‌ను ఆదా చేసింది. అలా ఖజానాకు 40 వేల కోట్ల రూపాయలు ఆదా అయింది. ఆ పొదుపు సొమ్ముతోనే రైతులకు ఈ విధంగా పంపుసెట్లను ఉచితంగా అందజేస్తోంది.
రాష్ట్రంలో మొత్తం 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 5 లక్షల పంపుసెట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. వచ్చే మూడేళ్లలో మొత్తం వ్యవసాయ పంపుసెట్లను మార్చాలన్నది ప్రభుత్వ ఆలోచన. రాష్ట్రంలోని అన్నింటిని మార్చడానికి 5 వేల కోట్ల రూపా యలు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించింది. అంటే దీనికి అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుంది. మొదట పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం డివిజన్‌లో లక్ష కొత్త పంపుసెట్లను అమర్చాలని నిర్ణయించారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం (చాగల్నాడు) ప్రాంతం లో ప్రయోగాత్మకంగా 2,496 పంపుసెట్లు బిగించడానికి విద్యుత్ శాఖ అధికారులు పూనుకున్నారు. ఇప్పటివరకు 670 పంపుసెట్లు బిగించారు. చిన్న చిన్న అడ్డంకులను తొలగించుకుంటూ వారి పనిని నిర్విగ్నంగా కొనసాగిస్తున్నారు. మొత్తానికి ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు కొత్త పంపుసెట్లతో వ్యయ్రపయాసలు తగ్గనున్నాయ. దీంతో వ్యవసాయ నిపుణులు కూడా హర్షిస్తున్నారు. రైతులు లాభపడ తారని, సాగు పెరుగుతుందని ఆనందం వెలిబుచ్చుతున్నారు.