బిజినెస్

కోల్ ఇండియా లక్ష్యానికి గండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 24: ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా తనకు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడం అనుమానంగానే కనిపిస్తున్నది. బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని ఈ సంస్థకు కేంద్రం లక్ష్యంగా ఉంచింది. కాగా, దీనిని అందుకునేందుకు విశేషంగా కృషి చేస్తున్నప్పటికీ, ఆశించిన ఫలితాలు రావడం లేదనే చెప్పాలి. గతంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు, తొమ్మిది నెలల కాలంలో దేశం 6.7 శాతం అధికంగా బొగ్గును దిగుమతి చేసుకుంది. దీనితో వివిధ దేశాల నుంచి తెచ్చుకున్న బొగ్గు 171.81 మెట్రిక్ టన్నులకు చేరింది. సంస్థకు నిర్దేశించిన లక్ష్యానికి విధించిన నిర్ధిష్టమైన కాలపరిమితిని సడలించాలని కేంద్రం ఆలోచిస్తున్న సమయంలోనే, ఈ గణాంకాలు వెలువడడం గమనార్హం. 2017-18 ఆర్థిక సంవత్సరంలో, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకూ దేశం దిగుమతి చేసుకున్న బొగ్గు 161 మిలియన్ టన్నులు. తాజా ఆర్థిక సంవత్సరంలో, అదే సమయానికి దిగుమతులు సుమారు ఏడు శాతం పెరగడం ఆందోళనకు గురి చేస్తున్న అంశం. దేశంలో బొగ్గు, ఇనుము ఉత్పత్తిపై ఎప్పటికప్పుడు నివేదికలను అందించే ‘ఎంజంక్షన్’ తాజాగా ప్రకటించిన గణాంక వివరాల్లో దిగుమతుల పెరుగుదల కనిపించింది. బొగ్గు దిగుమతులు పెరిగినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో తగ్గుతుందని టాటా స్టీల్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) సంయుక్త ఆధ్వర్యంలో నడుస్తున్న ‘ఎంజంక్షన్’ మేనేజింగ్ డైరెక్టర్/ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి వినయ వర్మ వ్యాఖ్యానించారు.
థర్మల్ పవర్ గ్రిడ్స్, ఇతరత్రా బొగ్గు వినియోగదారుల వద్ద నిల్వలు పెరుగుతున్నాయని చెప్పారు. అంతగాక, ఎక్కువ శాతం పవర్ ప్లాంట్స్‌కు స్థానికంగా ఉండే మైనింగ్ కంపెనీల నుంచి బొగ్గు అందుతున్నదని, ఇది కూడా డిమాండ్ తగ్గుదలకు కారణమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్‌లో 13.01 మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వచ్చిందని, డిసెంబర్ మాసంలో ఈ మొత్తం 12.52 మెట్రిక్ టన్నులకు తగ్గిందని వర్మ వివరించారు. వంటకు వినియోగించే బొగ్గు దిగుమతులు పెరిగినప్పటికీ, చివరి త్రైమాసికంలో తగ్గుతాయన్న నమ్మకం వ్యక్తం చేశారు. ఇలావుంటే, డిమాండ్‌కు తగినంత బొగ్గు దేశంలో ఉత్పత్తి కాకపోవడంతో, దిగుమతులు తప్పనిసరి అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బిలియన్ టన్నుల లక్ష్యాన్ని చేరుకోవడం కోల్ ఇండియాకు సాధ్యమవుతుందా? అనే ప్రశ్న తెరపైకి వస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో దిగుమతులు ఏ స్థాయిలో తగ్గుతాయనే విషయంపైనే కోల్ ఇండియా లక్ష్యాన్ని చేరుకునే అవకాశాలు ఆధారపడి ఉంటాయి.