బిజినెస్

హర్యానాలో మారుతీ సుజుకీ శిక్షణ సంస్థ ‘జిమ్’ కుదిరిన ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 25: మారుతీ సుజుకీ ఇండియా హర్యానాలో ‘జిమ్’ పేరిట సరికొత్త తయారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ‘జపనీస్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మేనేజ్‌మెంట్ (జిమ్) పేరిట ఏర్పాటు కానున్న ఈ యూనిట్‌కోసం మారుతీ సుజుకీ ఇండియా, హర్యానా రాష్ట్రాల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. ఇందులో 500 మంది యువకులకు శిక్షణను ఇస్తారు. ఇందులో భాగంగా మారుతీ సుజుకీ కంపెనీ రూ.7 కోట్లు ఖర్చుచేసి ఆదర్శ పారిశ్రామిక శిక్షణ సంస్ధ (ఐటీఐ)ని గురుగ్రామ్ జిల్లా ఊంచామిజ్రా గ్రామం వద్ద ఏర్పాటు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం స్థలాన్ని, భవన సదుపాయాలను ఏర్పాటు చేసింది. మారుతీ సుజుకీ సంస్థ ఆధునిక పరికరాలను, యంత్రాలను, నిపుణులైన శిక్షకులను సమకూరుస్తుందని తద్వారా నాణ్యత, భద్రత, క్రమశిక్షణ, కైజన్ వంటి జపనీస్ అంశాలపై శిక్షణనివ్వడం జరుగుతుందని ఎమ్‌ఎస్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకే టోమర్ తెలిపారు. హర్యానాలో ఇలాంటి సంస్ధ ఏర్పాటవడం ఇదే తొలిసారన్నారు. వచ్చే ఆగస్టు నుంచి తొలి సెషన్ ఆరంభమవుతుందన్నారు. కాగా ఇలాంటి జిమ్‌ను గుజరాత్‌లోని మెహసానాలో తొలిసారిగా మారుతీ సుజుకీ సంస్థ నెలకొల్పడం జరిగింది.