బిజినెస్

ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి చిన్న, మధ్యతరహా రైతులను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేర్కొన్న అంచనాలకు అనుగుణంగా లబ్ధి పొందేందుకు వీలుగా దేశంలోని చిన్న, మధ్యతరహా రైతులను వెంటనే గుర్తించాలని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ శనివారం అన్ని రాష్ట్రాలను కోరారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు సుదీర్ఘ లేఖలు రాసింది. దేశంలోని 12 కోట్ల మంది చిన్న, మధ్యతరహా రైతులకు ప్రయోజనం చేకూర్చే పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ తన ప్రసంగంలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ఇందులో దేశంలోని ఆయా రైతులకోసం ఈ ఏడాది మార్చినాటికల్లా 75 వేల కోట్ల రూపాయలు తొలివిడత ఆర్థిక సహాయం అందించనున్నట్టు పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి రైతులకు ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగా రెండు హెకార్లు (ఐదెకరాలు) పొలం కలిగిన రైతులంతా ఈ పథకం కింద ఏటా 6వేల రూపాయలు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఇందులో మొదటివిడతగా అర్హత కలిగిన ప్రతి రైతులు రెండు వేల రూపాయలు అందజేస్తారు. ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ శనివారం పీటీఐ ప్రతినిధితో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తన బడ్జెట్‌లో రైతుల బాగోగుల కోసం ప్రకటించిన ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ని దేశవ్యాప్తంగా అమలు చేయడంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవమని, కానీ ఒక్క ఉత్తర ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ పథకం అమలుకు కాస్త సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ దిశగా అడుగులు వేస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర బడ్జెట్‌లో చిన్న, మధ్యతరహా రైతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది తప్ప దేశంలోని అందరు రైతులకు వర్తించబోదని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ సరికొత్త పథకం అమలుకు ఈనెల 1వ తేదీన ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలు, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలను ఉద్దేశించి కేంద్ర వ్యవసాయ కార్యదర్శి లేఖలు రాసినట్టు తెలిపారు. ‘అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్ర పా లిత ప్రాంతాల్లో ఎంతమంది చిన్న, మధ్య తరహా రైతులు ఉన్నారో గ్రామాలవారీగా, పేరు, పురుషు డా? మహిళా? ఎస్సీనా ఎస్టీనా వంటి వివరాలు ఆ యా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అంటించాలి. అందులో పేర్కొన్న వివరా ల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో వీలైనంత త్వ రగా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందుతుంది’ అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ తెలిపారు.