బిజినెస్

మ్యూచువల్ ఫండ్స్‌లోకి నిధుల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశీయ మార్కెట్లలోని మూచువల్ ఫండ్స్‌లోకి గడచిన జనవరి నెలలో రూ.7వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గడచిన యేడాది ఇదే నెలలో రూ.5,200 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విదేశీ పోర్టుపోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) భారత ఈక్విటీ మార్కెట్లలోని వాటాల విక్రయాలకు పాల్పడటంతో మ్యూచువల్ ఫండ్ నిర్వాహకులకు వరంగా మారిందని మార్కెట్ రం గ నిపుణులు అంచనా వేస్తున్నారు. సెబీ డిపాజిటరీస్ గణాంకాల మేరకు మూచువల్ ఫండ్ నిర్వాహకులు గడచిన నెలలో రూ.7,160 కోట్ల విలువైన వాటాలను కొనుగోలు చేయించినట్టు తెలిసింది. మరోవైపు ఎఫ్‌పీఐలు రూ.5,264 నిధులను వెనక్కు తీసుకున్నారు. కాగా ప్రధానంగా దేశీయ రీటైల్ ఇనె్వస్టర్లు సిస్టమేటిక్ ఇనె్వస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఐపీ) ద్వారా పెట్టుబడులు కొనసాగించారని విశే్లషకులు అంచనావేస్తున్నారు. రాబోయే నెలల్లో సైతం ఈ ట్రెండ్ కొనసాగి నిధులు వెల్లువలా వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. ఎస్‌ఐపీలో చిన్నమొత్తాల్లో సైతం వారం, నెల, త్రైమాసిక విధాల్లో పెట్టుబడులు పెట్టే వీలుంటుంది. ఇది ఒకరకంగా రికరింగ్ డిపాజిట్ల వంటివే. కాగా ఈక్విటీ మార్కెట్ల నుంచి నిధులు వెనక్కు మళ్లడాన్ని పరిశీలిస్తే మదుపర్లు వేచిచూసే ధోరణిని ప్రదర్శించారని అవగతమవుతుందని సీనియర్ మార్కెట్ విశే్లషకుడు హిమాంశు శ్రీవాత్సవ పేర్కొన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, దేశ ఆర్థిక స్థితిపై మదుపర్లు ప్రధాన దృష్టి కేంద్రీకరించారని తేటతెల్లం అవుంతోందన్నారు. ప్రపంచ వాణిజ్య యుద్ధం, ముడిచమురు ధరల పెరుగుదల, కరెన్సీ విలువ తదితర అంశాలు సైతం మదుపర్లు పరిగణనలోకి తీసుకుని ముందుకెళుతున్నారని వివరించారు.