బిజినెస్

జపాన్‌లో ఉద్యోగాలపై ఉత్తరాంధ్ర యువత ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: జపాన్ కంపెనీల్లో ఉద్యోగాలు చేయడానికి మన యువత ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చొరవతో తొలిసారి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జపాన్ జాబ్ ఫెయిర్‌లో విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే జపాన్ కంపెనీల అభిమానాన్ని చూరగొన్నారు. సాంకేతిక అంశాల జోలికి వెళ్లకుండా కేవలం హెచ్‌ఆర్ రౌండ్ ద్వారా విద్యార్థుల వ్యక్తిత్వాన్ని, జపాన్‌లో ఉద్యోగాలు చేయడానికి గల ఆసక్తిని, భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని జపాన్ నిపుణుల బృందం సుదీర్ఘంగా పరిశీలించింది. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంతోపాటు ఉత్తరాంధ్రలోని పలు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఎంపిక చేసుకున్న 300 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్వ్యూలను నిర్వహించారు.
భారతదేశ యువతరం ప్రపంచంలో ఏ దేశంలో అయినా నెగ్గుకురాగలరు. వారి ఆంగ్లభాషా పరిజ్ఞానం, నైపుణ్యం సంస్థల ప్రగతికి అవసరం. ఈ కారణంగానే జపాన్‌లో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా భారతదేశ యువతరంపై దృష్టి సారించామని జాబ్‌ఫెయిర్ సంధానకర్తగా వ్యవహరిస్తున్న న్యూఎరా సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోజి మురాటా వెల్లడించారు. మంగళవారం జపాన్ జాబ్ ఫెయిర్‌లో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు భారత్‌లో ఐఐటీలపైనే దృష్టి సారించిన జపాన్ కంపెనీలు గీతం వంటి విశ్వవిద్యాలయాల్లో, ద్వితీయశ్రేణి పట్టణాలలో కూడా సమర్థులైన ఇంజనీరింగ్ యువత ఉన్నట్టు గుర్తించాయన్నారు. జపాన్ తయారు చేసే సాంకేతిక ఉత్పత్తులు కొన్ని మినహా మిగిలిన వాటి గురించి కూడా భారతీయ యువతకు తెలియకపోవడం గమనించి బ్రాండింగ్ కోసం భారత్‌లో ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించకున్నట్టు ఆయన తెలిపారు.జపాన్ కంపెనీలు భారీ వేతనంతో ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రాంగణ నియామకాల్లో ఎంపిక చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నాయని, ముఖ్యంగా ఐటీ, కంప్యూటర్ సైన్స్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలకు చెందిన వారిపై దృష్టి సారించినట్టు ఇన్ఫోబ్రిడ్జ్ హోల్డింగ్ గ్రూప్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సహో సిగేటా తెలిపారు. ర్యాంకింగ్‌లో అగ్రశ్రేణిలో గుర్తింపు పొందిన గీతం వంటి విద్యాసంస్థల నుంచి ఇకపై క్రమం తప్పక విద్యార్థులను ఎంపిక చేసుకోవడానికి జపాన్ కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు.
చిత్రం.. గీతం జాబ్ ఫెయిర్‌లో జపాన్ బృందంతో విద్యార్థులు