బిజినెస్

50 శాతానికి పైగా వాటాలు విక్రయిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్‌లోని ప్రధాన సంస్థ జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జెడ్‌ఈఈఎల్) ప్రమోటర్లు సంస్థలోని తమ వాటాలలో 50 శాతానికి పైగా విక్రయించడానికి ముందుకు వచ్చారు. సంస్థ తీసుకున్న రుణాలను చెల్లించడానికి గాను తమ ఆస్తులను నగదుగా మార్చుకుంటున్న ప్రక్రియలో భాగంగా వారు ఈ చర్యకు ఉపక్రమించారు. ఇదే అంశంపై వారు ఇద్దరికన్నా ఎక్కువ మంది ఇనె్వస్టర్లతో చర్చలు జరుపుతున్నారని కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ గత సంవత్సరం నవంబర్‌లో సుభాశ్ చంద్ర నేతృత్వంలో తన ప్రమోటర్లు తమ వాటాలలో 50 శాతానికి పైగా వ్యూహాత్మక భాగస్వామికి విక్రయించడానికి నిర్ణయించుకున్నారని ప్రకటించింది. ‘మా ఆలోచన మారలేదు.. అయితే, ఎవరయినా 50 శాతానికి మించి వాటాలను కొనుగోలు చేయడానికి ముందుకు వస్తే ఆ ప్రతిపాదనను మేము పరిశీలిస్తాం’ అని జెడ్‌ఈఈఎల్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) పునిత్ గోయెంకా తెలిపారు. ప్రమోటర్లు 2018 డిసెంబర్ 31నాటికి జీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో 41.62 శాతం వాటాలను కలిగి ఉన్నారు. అయితే, శక్తివంతులయిన ఇనె్వస్టర్లతో జరిపిన చర్చలలో భాగంగా ప్రమోటర్లు తమ వాటాలలో సుమారు 20 శాతాన్ని విక్రయించడానికి గతంలోనే సంసిద్ధత వ్యక్తం చేశారని గోయెంకా తెలిపారు.