బిజినెస్

కఠిన చర్యలు తీసుకుంటున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 28: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు ప్రమాదకర స్థాయికి చేరిన నేపథ్యంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఎగవేస్తున్నవారిపై ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కఠిన చర్యలు తీసుకుంటున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. లిక్కర్ వ్యాపారి విజయ్ మాల్యా తరహా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ బ్లూంబర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడిన మోదీ.. కార్పొరేట్ డిఫాల్టర్ల నుంచి బకాయిలు రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతున్నామన్నారు. గత ఏడాది మార్చిలో 2,67,065 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్న మొండి బకాయిలు.. డిసెంబర్‌కు 3,61,731 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. మున్ముందు ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్న సంకేతాలు స్పష్టమవుతుండగా, మొండి బకాయిల జాబితాలో చేరనున్న రుణాలతో కలిపితే 8 లక్షల కోట్ల రూపాయలకు చేరుతుందని అంచనా.
ముక్కుపిండి వసూలు చేస్తాం: జైట్లీ
విజయ్ మాల్యా లాంటి ఉద్దేశపూర్వక ఎగవేతదారులను హెచ్చరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం తీవ్రంగా స్పందించారు. ‘గౌరవప్రదంగా తీసుకున్న రుణాలను చెల్లించాలి. లేదంటే ముక్కుపిండి వసూలు చేస్తాం.’ అన్నారు. పిటిఐకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘వ్యక్తిగత కేసులపై నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదు. అయితే పెద్ద సంఖ్యలో సంస్థలున్న విజయ్ మాల్యా లాంటివారు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉంది.’ అన్నారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. విమానయాన సేవలకు దూరమైనది తెలిసిందే. ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 9,000 కోట్ల రూపాయల మేర బకాయి పడింది. వీటి వసూళ్ల కోసం బ్యాంకులు డెట్ రికవరీ ట్రిబ్యునల్, చివరకు కోర్టులనూ ఆశ్రయించాయి. మరోవైపు మాల్యా రుణాల ఎగవేత కేసును సంస్థలవారీగా విచారించాలని పారిశ్రామిక సంఘం ఫిక్కీ ప్రభుత్వాన్ని కోరింది.
అధిక వడ్డీరేట్లు వృద్ధికి విఘాతం
అధిక వడ్డీరేట్లు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారి తీస్తాయని జైట్లీ అన్నారు. తద్వారా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్) తదితర చిన్నమొత్తాల పొదుపు పథకాలపై వడ్డీరేట్ల తగ్గింపును సమర్థించుకున్నారు.

చిత్రం బ్లూంబర్గ్ ఇండియా ఎకనామిక్ ఫోరమ్‌లో మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ