బిజినెస్

వడ్డీరేట్లు తగ్గుతాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ తన చివరి ద్రవ్యసమీక్షను మంగళవారం నిర్వహించనున్నారు. వచ్చే నెలతో రాజన్ మూడేళ్ల పదవీకాలం ముగియనున్నది తెలిసిందే. ఇకపోతే ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను రాజన్ చేపడుతుండగా, ద్రవ్యోల్బణం పెరుగుతున్న సంకేతాల మధ్య కీలక వడ్డీరేట్ల తగ్గింపు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ మాత్రం పావు శాతం మేర తగ్గవచ్చని అంచనా వేస్తోంది. వర్షాల కారణంగా పంట దిగుబడులు పెరిగితే ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని, కాబట్టి వడ్డీరేట్ల తగ్గింపునకే ఆర్‌బిఐ మొగ్గుచూపవచ్చని సోమవారం అభిప్రాయపడింది.