బిజినెస్

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు స్వీకరించిన జైట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను అరుణ్ జైట్లీ శుక్రవారం స్వీకరించారు. అనారోగ్యం కారణంగా అమెరికాకు వెళ్లి, అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే. అనంతరం అక్కడి వైద్యుల అభిప్రాయం తీసుకున్న తర్వాత జైట్లీ మళ్లీ స్వదేశానికి వచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ వేచిచూసిన తర్వాత, శుక్రవారం ఆయన మళ్లీ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జైట్లీ అందుబాటులో లేనప్పుడు ఆ శాఖను రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ తాత్కాలికంగా అప్పగించారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో మధ్యంతర బడ్జెట్‌ను గోయల్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశం లేదు. కాబట్టి, మధ్యంతర బడ్జెట్‌లోనే గోయల్ ఎన్నో అంశాలను ప్రస్తావించారు. బీజేపీ నాయకత్వం వహిస్తున్న ఎన్డీఏ కూటమి రాబోయే ఎన్నికల్లో ఇవ్వబోయే హామీలు, కీలక అంశాలను గోయల్ తన మధ్యంతర బడ్జెట్‌లో ప్రస్తావించారు. పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. కాగా, గోయల్ మధ్యంతర బడ్జెట్‌లోని వివిధ అంశాలను పరిశీలించి, వాటి అమలుకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించడానికి జైట్లీ ప్రయత్నించనున్నారు. మొత్తం మీద ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలను మళ్లీ జైట్లీ స్వీకరించడంతో, స్టాక్ మార్కెట్ నుంచి వృద్ధి రేటు వరకూ అన్ని అంశాల్లోనూ పరిస్థితులు చక్కబడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.