బిజినెస్

అండగా మేముంటాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: జమ్మూకాశ్మీర్ పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో మృతి చెందిన సీఆర్‌పీఎఫ్ అమర జవాన్లకు రిలయన్స్ ఫౌండేషన్ నివాళులర్పించింది. వారి కుటుంబాలకు అండగా మేముంటామంటూ భరోసా ఇచ్చింది. మృతి చెందిన జవాన్ల కుటుంబాల పోషణతోపాటు, వారివారి పిల్లల చదువు బాధ్యతను కూడా తీసుకుంటామని రిలయన్స్ ఫౌండేషన్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
అదే విధంగా ఈ సంఘటనలో గాయపడిన సీఆర్‌పీఎఫ్ జవాన్లకు చికిత్స అందించడానికి తమ ఆసుపత్రి సిద్ధంగా ఉందన్నారు. ఇవే కాకుండా, ఒకవేళ ప్రభుత్వం మరేదైనా బాధ్యతని అప్పచెప్తే, దానిని కూడా నెరవేరుస్తామని, అది తమ కనీస బాధ్యత అని వ్యాఖ్యానించింది. రియలన్స్ ఇండస్ట్రీస్ (రిల్) ఆధ్వర్యంలో ఈ ఫౌండేషన్ పని చేస్తున్నది.