బిజినెస్

అమరావతికి ప్రపంచ బ్యాంకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, ఆగస్టు 11: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు తన వంతుగా చేయూతను అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రాజెక్ట్ కానె్సప్ట్ నోట్‌కు ప్రపంచ బ్యాంకు అమోద ముద్రను వేసింది. అమరావతిలో గత నాలుగు రోజులుగా పర్యటించిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం పర్యటన విజయవంతం అయ్యింది. ప్రపంచ బ్యాంకు బృందం పర్యటనలో చివరి రోజు గురువారం బృందం సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అధికారులతో సమావేశమయ్యారు. అమరావతి సప్టెయినబుల్ కేపిటల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించి ప్రాజెక్ట్ కానె్సప్ట్ నోట్‌కు ఆమోదం లభించిందని బృందం సభ్యులు అధికారులకు తెలిపారు. వౌలిక వసతుల కల్పనకు అందించే ఆర్థిక సహాయం, పేదల అనుకూల కనీస పట్టణ వౌలిక వసతులు, పర్యావరణ అనుకూల పట్టణ వౌలిక సౌకర్యాలు, సాంకేతిక సహకారం అనే ఉప విభాగాలుగా విభజించి అందించడం జరుగుతుందన్నారు. ఏపీసీఆర్‌డీఏ ప్రాధాన్య అంశాలైన గ్రామాల వౌలిక సదుపాయాలు, వరద నిర్వహణ, రహదారి వ్యవస్థ అభివృద్ధిప్రాజెక్టుల అమలుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహకారం అందించేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. ప్రతిపాదిత రుణంలో 30 శాతం నిధుల సత్వర విడుదలకు అవసరమైన డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ప్రపంచ బ్యాంకు సభ్యులు అధికారులకు సూచించింది. మే చివరి వారంలో జరిపిన పర్యటనలో చర్చించిన పలు అంశాలకు సంబంధించి ఇప్పటి వరకు సాధించిన పురోగతిని ప్రపంచ బ్యాంకు బృందం ఈ సందర్భంగా విశే్లషించింది. అలాగే గత నాలుగు రోజులుగా సీఆర్‌డీఏ అధికారులు, సీసీడీఎంసీ అధికారులు, కన్సల్టెంట్లతో విపులంగా చర్చిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో చేపట్టబోయే వౌలిక వసతుల అభివృద్ధికి రూపొందించిన డీపీఆర్‌పై విస్తృతంగా చర్చించి తమ సూచనలను సలహాలను అందించింది. అలాగే తమ పర్యటనలో భాగంగా ఇదే అంశంపై నేలపాడులో పర్యటించి చేపట్టబోయే అభివృద్ధి పనులపై ప్రజల అభిప్రాయాలను సేకరించినట్లు అధికారులకు తెలిపారు. 30 శాతం నిధులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించాల్సి ఉంటుందని, తదనుగుణంగా కార్యచరణ తయారు చేశామని ప్రపంచ బ్యాంకు సభ్యుల బృందం టీమ్‌లీడర్ రఘు కేశవన్ తెలిపారు. అనంతరం కమీషనర్ శ్రీ్ధర్ మాట్లాడుతూ రాజధానిలో పలు ప్రాజెక్టుల్లో పర్యావరణానికి, పారదర్శకతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో త్వరితగతిన రాజధాని ప్రాంత అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలిపారు. అయితే ఇప్పటి వరకు జరిపిన చర్చలపై ప్రపంచ బ్యాంకు బృందంతో పాటు ఏపీసీఆర్‌డీఏ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రఘు కేశవన్ నేతృత్యంలో వచ్చిన ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు బృందంలో ఆర్థిక, సామాజిక, పర్యావరణ, నీటి సరఫరా, శానిటేషన్, ప్రొక్యూర్‌మెంట్, సమాచార నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకు బృందం తదుపరి పర్యటన అక్టోబర్‌లో చేయనుంది. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ వి రామమనోహరరావు, చీఫ్ ఇంజినీర్ డి కాశీవిశే్వశ్వరరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.