బిజినెస్

గెలాక్సీ నోట్-7.. వచ్చేసింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 11: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ శ్యాంసంగ్ గురువారం తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ఫోన్ ‘గెలాక్సీ నోట్-7’ను భారత్‌లో ఆవిష్కరించింది. దీని ధరను 59,900 రూపాయలుగా నిర్ణయించింది. అంతేకాకుండా తమ ఖాతాదారులకు మూడు నెలల పాటు ఉచితంగా వాయిస్, డేటా సర్వీసులను అందించేందుకు రిలయన్స్ జియోతో శ్యాంసంగ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ప్రస్తుతం గాడ్జెట్ ప్రియులను విశేషంగా అలరిస్తున్న ఆపిల్ ఐఫోన్, బ్లాక్‌బెర్రీ ప్రివ్, హెచ్‌టిసి-10 వంటి స్మార్ట్ఫోన్లకు పోటీగా తీసుకొచ్చిన గెలాక్సీ నోట్-7కు ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ప్రీ-బుకింగ్స్ స్వీకరిస్తారు. 2011లో తాము కొత్త కేటగిరీలో ప్రవేశించి తొలిసారి మార్కెట్లో ప్రవేశపెట్టిన గెలాక్సీ నోట్‌కు కొనుగోలుదారుల నుంచి విశేషమైన ఆదరణ లభించిందని, ప్రీమియం స్మార్ట్ఫోన్ల సెగ్మెంట్‌లో తమ మార్కెట్ వాటాను బలోపేతం చేసుకునేందుకు నోట్ సిరీస్ ఎంతగానో దోహదం చేస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నామని శ్యాంసంగ్ ఇండియా వైస్-ప్రెసిడెండ్ (మొబైల్ బిజినెస్) మను శర్మ తెలిపారు. ఐరిస్ స్కానర్, మెరుగైన ఎస్-పెన్ వంటి సరికొత్త ఫీచర్లతో నోట్ ప్రేమికులతో పాటు కొత్త ఖాతాదారులను ఆకట్టుకునే విధంగా నోట్-7ను తీర్చిదిద్దినట్లు ఆయన చెప్పారు. దేశీయంగా తయారు చేస్తున్న గెలాక్సీ నోట్-7లో 5.7 అంగుళాల డిస్‌ప్లే, వెనుక 12 మెగాపిక్సెల్, ముందు 5 మెగాపిక్సెల్ కెమెరాలతో పాటు 64జిబి ఇన్‌బిల్ట్ మెమరీని, 3,500 మిల్లీ ఆంపియర్ల బ్యాటరీ ఉంటాయి. గెలాక్సీ నోట్-7 స్మార్ట్ఫోన్‌తో పాటు ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా ‘గేర్ ఫిట్-2’ (స్మార్ట్‌వాచ్), ఐకాన్ ఎక్స్ (వైర్లెస్ ఇయర్‌ఫోన్స్), గేర్ విఆర్ (వర్చువల్ రియాల్టీ గ్లాసెస్)ను కూడా శ్యాంసంగ్ మార్కెట్లో ప్రవేశపెడుతోందని మను శర్మ తెలిపారు.