బిజినెస్

బలపడిన ఐదు సంస్థలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 3: పది అత్యంత విలువయిన పది భారతీయ కంపెనీలలోని అయిదు కంపెనీల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారంతో ముగిసిన గత వారంలో రూ. 35,503 కోట్లు పెరిగింది. ఇందులో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అత్యధికంగా లబ్ధి పొందింది. టీసీఎస్, ఐటీసీ, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ గత వారంలో తమ మార్కెట్ విలువను పెంచుకోగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్ మహింద్రా బ్యాంక్ మరోవైపు తమ మార్కెట్ విలువను కోల్పోయాయి. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 24,671.93 కోట్లు పెరిగి, రూ. 7,47,343.7 కోట్లకు చేరుకుంది. ఐటీసీ మార్కెట్ విలువ రూ. 4,328.83 కోట్లు పెరిగి, రూ. 3,40,369.6 కోట్లకు చేరుకుంది. ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ రూ. 3,407.55 కోట్లు పెరిగి, రూ. 3,23,782.7 కోట్లకు చేరుకుంది. ఎస్‌బీఐ ఎంక్యాప్ రూ. 1,963.41 కోట్లు పుంజుకొని, 2,43,597.3 కోట్లకు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 1,131.27 కోట్లు పెరిగి, రూ. 2,27,770.4 కోట్లకు చేరుకుంది.
మరోవైపు, హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ (హెచ్‌యూఎల్) మార్కెట్ విలువ రూ. 7,110.87 కోట్లు తగ్గి, రూ. 3,75,555.8 కోట్లకు చేరుకుంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్ విలువ రూ. 4,344.84 కోట్లు పడిపోయి, రూ. 3,19,880.7 కోట్లకు చేరింది. రిల్ మార్కెట్ విలువ రూ. 3,739.81 కోట్లు తగ్గి, రూ. 7,77,564.2 కోట్లకు చేరింది. కోటక్ మహింద్రా బ్యాంక్ ఎంక్యాప్ రూ. 2,757.11 కోట్లు పడిపోయి, రూ. 2,34,039.5 కోట్లకు తగ్గింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 2,300.05 కోట్లు పడిపోయి, రూ. 5,67,036.2 కోట్లకు తగ్గింది.