బిజినెస్

ఎలక్ట్రిక్ బస్సులొచ్చేశాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎట్టకేలకు హైదరాబాద్ నగరవాసులకు ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం ఆర్టీసీ సీఎండీ సునీల్‌శర్మ ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. తొలి దశలో 40 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణీకుల కోసం ఏర్పాటు చేశారు. మియాపూర్, కంటోనె్మంట్ బస్సు డిపోల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుపుతున్నారు. మొదట రాష్ట్రాల రాజధానుల్లో కాలుష్య రహిత ప్రయాణాన్ని ప్రయాణీకులకు అందించాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ ప్రక్రియలో భాగంగా హైదరాబాద్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించింది. తొలి విడతలో భాగంగా 40 బస్సులను మంజూరు చేసింది. ఆరునెలల క్రితమే హైదరాబాద్‌లో తిరగాల్సి ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వల్ల ఆలస్యమైంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న యోచనతో ఆర్టీసి అధికారులు మంగళవారం ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సవానికి రాలేకపోయారు. ప్రస్తుతం ఎయిర్‌పోర్టు మార్గంలో 46 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతారు. ఏసీ బస్సులల్లో వసూలు చేస్తున్న చార్జీలనే ఎలక్ట్రిక్ బస్సుల్లో తీసుకుంటారు. మెట్రోకు అనుసంధానంగా బుధవారం నుంచి ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమంలో సిటీ ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వినోద్, కూకట్‌పల్లి డీవీఎం దేవదాస్ పాల్గొన్నారు. ఎలక్ట్రిక్ బస్సులకు విద్యుత్ చార్జి రీచార్జి చేయడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఒకసారి చార్జిచేస్తే 360 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. ఒక కిలోవాట్ విద్యుత్‌కు రూ. 6.25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. పెట్రోఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడల్లా ఆర్టీసీ చార్జీల పెంచుతారు. ఎలక్ట్రిక్ బస్సులకు అటువంటి ఇబ్బందులు ఉండవని ఆర్టీసీ సీఎండీ సునీల్‌శర్మ స్పష్టం చేశారు.

చిత్రం.. ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభిస్తున్న టీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్
డైరెక్టర్ సునీల్ శర్మ, ఒలెక్ట్రా ఎండీ రావెల్, బీవైడీ ఎండీ లూయి