బిజినెస్

విస్తరణ దిశగా డీబీఎస్ బ్యాంక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గురుగ్రామ్, మార్చి 6: డీబీఎస్ బ్యాంక్ ఇండియా గ్రూప్ మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో తమ బ్యాంకు కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా ముమ్మర చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రానున్న 18 నెలల కాలంలో 600 నుంచి 800 మంది వరకు వివిధ విభాగాల్లో సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. సింగపూర్‌కు చెందిన ఒక అతి పెద్ద పెట్టుబడిదారు మన దేశంలో దేశీయ అనుబంధ సంస్థ లైసెన్సును తీసుకుందని సంబంధిత బ్యాంకుకు చెందిన ఒక సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. గురుగ్రామ్, నొయిడా, కోయంబత్తూర్ ప్రాంతాల్లోని మూడు బ్యాంకు శాఖలను ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో తొమ్మిది చోట్ల అనువైన భవనం కోసం వెతికినట్టు ఆ అధికారి పేర్కొన్నారు. ‘మా బ్యాంకు కొత్త శాఖల్లో వచ్చే 12-18 నెలల కాలంలో 600 నుంచి 800 మంది సిబ్బంది వివిధ విభాగాల్లో నియమించనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని టెక్నాలజీ డెవలప్‌మెంట్ సెంటర్‌లో సైతం తగిన సిబ్బందిని నియమిస్తామని డీబీఎస్ బ్యాంక్ ఇండియా (కన్యూమర్ బ్యాంకింగ్ గ్రూప్) హెడ్ శంతనుసేన్ గుప్తా బుధవారం గురుగ్రామ్‌లో బ్యాంక్ శాఖ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో వెల్లడించారు. రెండున్నరేళ్ల క్రితం హైదరాబాద్‌లో టెక్నాలజీ గ్రూప్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన తమ డీబీఎస్ గ్రూప్‌లో ఇప్పటికే 1200 మంది సిబ్బంది ఉన్నారని ఆయన తెలిపారు. తమ బ్యాంకు కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా చేస్తున్న ప్రయత్నాలో భాగంగా 100 వినియోగదారుల సేవా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామన్నారు.
దేశంలోని 25 పట్టణాల్లో వచ్చే 12-18 నెలల కాలంలో కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం 125 నుంచి 150 కోట్ల రూపాయల నిధులు వెచ్చించనున్నామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారంనాడు హైదరాబాద్, అహమ్మదాబాద్, వడోదరలో మూడు బ్యాంక్ శాఖలు ప్రారంభించామని ఆయన తెలిపారు. వచ్చే సోమవారంనాడు ముంబయిలో ఒక శాఖను ఏర్పాటు చేస్తామని, వచ్చే వారంలో ఇండోర్, లూథియానాలో మరో శాఖలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.