బిజినెస్

స్థిరంగా బంగారు, వెండి ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 6: బంగారం, వెండి వాణిజ్యం బుధవారం స్థబ్ధుగా సాగింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల (తులం) బంగారం ధర 33,430 పలుకగా, వెండి ధరలు సైతం స్థిరంగా కిలో 39,500 రూపాయలు పలికింది. దేశీయ నగల వ్యాపారుల నుంచి డిమాండ్ తగ్గడంతో బుధవారం బంగారం ధర తులంపై 20 రూపాయలు తగ్గిందని వాణిజ్య వర్గాలు వెల్లడించాయి. ఇక అంతర్జాతీయంగా మాత్రం బంగారం ధరల్లో వృద్ధి కనిపించింది. న్యూయార్క్‌లో ఔన్సు బంగారం ధర 1,290.45 డాలర్లు పలుకగా, వెండి ధరల్లో మాత్రం పెద్దతేడా లేదు. ఔన్సు వెండి ధర 15.14 డాలర్లు వద్ద ట్రేడయింది. ఇక మనదేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛ బంగారం 10 గ్రాములు 33,430 పలుకింది. అలాగే 99.5 శాతం స్వచ్ఛ బంగారం 10 గ్రాములపై రూ.40 తగ్గి 33.260 పలికింది. ఐతే ఎనిమిది గ్రాములతో కూడిన సవరం బంగారం ధరలు మాత్రం రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగాయి. కాగా వార ప్రాతిపదికన సరఫరా జరిగే వెండి మాత్రం కిలోపై 594 రూపాయలు పెరిగి 38,709 వద్ద ట్రైడవడం గమనార్హం. ఇక వెండి నాణేలు 100 పీసులకు కొనుగోళ్లలో రూ.80 వేలు, విక్రయాల్లో రూ.81 వేల వంతున ధర పలికాయి.