బిజినెస్

జ్యోతి స్ట్రక్చర్స్ లిక్విడేషన్‌కు బ్రేక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: దివాలా ప్రక్రియకు వెళ్లిన జ్యోతి స్ట్రక్చర్స్ లిమిటెడ్‌కు కొంత ఊరట లభించింది. గతంలో ఇచ్చిన లిక్విడేషన్ ఉత్తర్వును నేషనల్ కంపెనీ లా అపెలైట్ ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) రద్దు చేసింది. కేసు పూర్వాపరాలను న్యాయమూర్తి ఎస్‌జే ముఖోపాధ్యాయ నేతృత్వంలోని ఇద్దరు సభ్యుల కమిటీ పరిశీలించిన తర్వాత, 4,000 కోట్ల రూపాయలతో శరద్ సంఘీ తదితరులు ప్రతిపాదించిన రిజల్యూషన్ ప్లాన్‌ను పరిగణలోకి తీసుకోవాలని ముంబయిలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ని ఆదేశించింది. రెండు వారాల్లోగా ఈమేరకు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. ముంబయి ఎల్‌సీఎల్‌టీ ఇచ్చిన లిక్విడేషన్ తీర్పును పునఃసమీక్షించాల్సిందిగా అందిన పిటిషన్‌పై ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం సుదీర్ఘంగా చర్చించింది. పూర్వాపరాలను విశే్లషించింది. అనంతరం కేసును తిరిగి ముంబయి ఎన్‌సీఎల్‌టీకి పంపింది. అయితే, దావాలా ప్రక్రియకు వెళ్లాలన్న తీర్పును పక్కకుపెట్టి, శరత్ సంఘీ తదితరులు ఇచ్చిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడమేగాక, అందుకు అనుగుణంగా తీర్పును వెల్లడించాలని ఆదేశించింది. సాధ్యమైనంత త్వరలో ముంబయి ఎన్‌సీఎల్‌టీ తీర్పునిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఈ ప్రక్రియ రెండు వారాలకు మించకూడదన్న షరతు విధించింది. శరత్ సంఘీ సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్‌ను గత ఏడాది జూలై 31న ముంబయి ఎన్‌సీఎల్‌టీ తిరస్కరించింది. జ్యోతి స్ట్రక్చర్స్ దివాలా తీసినట్టు ప్రకటించి, ఆస్తులను జప్తుచేసి, అమ్మాలంటూ తీర్పునిచ్చింది. దీనిపై శరత్ సంఘీ ఎల్‌సీఎల్‌ఏటీని ఆశ్రయించడంతో, దివాలా ప్రక్రియకు బ్రేక్ పడింది. ఈ ఓటింగ్ జరిగినప్పుడు రుణదాతల కమిటీ (సీఓసీ)లో 62 శాతం మంది శరత్ సంఘీ ప్రతిపాదనకు అనుకూలంగా ఓటు వేశారు. 23.12 శాతం ఓట్లు ఈ ప్రతిపాదనకు ప్రతికూలంగా వచ్చాయి. మిగతా 14.21 శాతం మంది ఓటింగ్‌కు హాజరుకాలేదు.