బిజినెస్

సువెన్ లైఫ్ ఉత్పత్తులకు వివిధ దేశాల పేటెంట్ హక్కులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: సువెన్ లైఫ్ సైనె్సస్ ఉత్పత్తి చేస్తున్న ఔషధాలను యూరేసియా, ఐరోపా, దక్షిణకొరియా, శ్రీలంక దేశాల మార్కెట్లలో విక్రయించేందుకు సంబంధించిన ప్రాడక్టు పేటెంట్ హక్కులు మంజూరయ్యాయి. నరాలకు సంబంధించిన ప్రమాదకరమైన రోగాలను నయం చేయగలికే సరికొత్త రసాయనికతతో కూడిన ఈ ఔషధాలకు వివిధ దేశాల్లో పేటెంట్ హక్కులు లభించడం పట్ల సంస్థ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో హర్షం వ్యక్తం చేసింది. 2034 వరకు ఈ పేటెంట్ హక్కులు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. సెంట్రల్ నర్వెస్ సిస్టం (సీఎన్‌ఎస్) విభాగంలో కణాల పరిశోనలో తాము సాధించిన సరికొత్త ఫలితాలతో ఆవిష్కృతమైన ఔషధాలకు ఇలాప్రపంచ దేశాల్లో మార్కెట్ విస్తరణకు అవకాశం ఏర్పడటం ఆనందదాయకమని సువెన్ లైఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్ జాస్తి శుక్రవారం నాడిక్కడ పేర్కొన్నారు. న్యూరో డీజనరేటివ్ డిజార్డర్లయిన అల్జీమర్స్, హంటిగ్టన్స్, పార్కిన్సన్, స్కిజోప్రెనియా వంటి రోగాలకు చేసే చికిత్సలో తమ కంపెనీ ఔషధాలు బాగా పనిచేస్తాయని ఆయన చెప్పారు.