బిజినెస్

ఆరంభ ఇస్యూతోనే అదరగొట్టిన ‘ఆర్‌ఈఐటీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: స్థిరాస్థి వ్యాపారాల్లో పేరెన్నికగన్న బ్లాక్‌స్టోన్, ఎంబసీ గ్రూప్ జాయింట్ వెంచర్ ‘ఎంబసీ ఆఫీస్ పార్క్’కు చెందిన రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ట్రస్ట్ ‘ఆర్‌ఈఐటీ’ సోమవారం ఆరంభ దశలోనే మార్కెట్‌లో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ విభాగానికి చెందిన ఇస్యూ బీఎస్‌ఈలో తొలుత రూ.300గా స్థబ్ధుగా విడుదలైంది. అయితే అనూహ్యంగా ఈ ఇస్యూ ధర సుమారు 5.9 శాతం పెరిగి 317.70 రూపాయలకు చేరింది. ఎన్‌ఎస్‌ఈలో ఈ యూనిట్ తొలి ఇస్యూ రూ.308గా విడుదలైంది. అక్కడ కూడా 2.66 శాతం లాభాన్ని నమోదుచేసి ఆ తర్వాత జరిగిన వాణిజ్య ప్రక్రియలో 6.26 శాతం అధిక లాభాల్లోకి ఒక్కసారిగా ఎగబాకింది. దీంతో ఇస్యూ ధర 318.80కి చేరింది. కాగా ఆర్‌ఐఈటీ మార్కెట్ విలువ బీఎస్‌ఈలో 24,446.36 కోట్లకు చేరింది. దేశంలో తొలి రియల్ ఎస్టేట్ ఇనె్వస్ట్‌మెంట్ ట్రస్ట్‌కు చెందిన ఈ ఇస్యూ గతనెలలో బిడ్డింగ్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి 2.57 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడి సంస్థ సుమారు 4,750 కోట్ల రూపాయలు సమీకరించేందుకు దోహదం చేసింది. తొలుత ఈ ఇస్యూను ఒక యూనిట్‌కు రూ.299 నుంచి 300గా నిర్ణయించారు. ఆర్‌ఈఐటీ అనేది ఒక పెట్టుబడులకు వినియోగించే సాథనం దీనికి రియల్ ఎస్టేట్ ఆస్తులకు సంబంధించిన నిర్వహణ, అద్దెల వసూళ్లు వంటి అధికారాలుంటాయి. వ్యక్తిగత మదుపర్లకు ఇందులో పెట్టుబడులు పెట్టి మంచి ఆదాయాన్ని రాబట్టుకోవడానికి వీలుంటుంది.