బిజినెస్

ఆర్‌బిఐ ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లపై అంచనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: వచ్చే నెల 5న జరిపే ద్రవ్యసమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీరేట్లను పావు శాతం చొప్పున తగ్గించవచ్చని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ అంచనా వేసింది. అలాగే రిటైల్ ద్రవ్యోల్బణం మార్చి నెలలో దాదాపు 5 శాతానికి పరిమితం కావచ్చంది. ఆగస్టులో జరిపే సమీక్షలోనూ రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు తగ్గవచ్చని అభిప్రాయపడింది. ఫిబ్రవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.2 శాతానికి తగ్గగా, టోకు ద్రవ్యోల్బణం మైనస్‌లోనే ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) గణాంకాలు కూడా పతనం కావడంతో ఏప్రిల్ 5న జరిగే సమీక్షలో కీలక వడ్డీరేట్లను ఆర్‌బిఐ 25 బేసిస్ పాయంట్లు తగ్గించవచ్చన్న అంచనాలను బ్యాంక్ ఆఫ్ అమెరికా వ్యక్తం చేసింది.

అర శాతం తగ్గొచ్చు
న్యూఢిల్లీ, మార్చి 29: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వచ్చే నెల జరిపే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లు అర శాతం తగ్గే అవకాశాలున్నాయని డిబిఎస్ ఓ నివేదికలో అంచనా వేసింది. రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు అదుపులో ఉన్న నేపథ్యంలో రెపో, రివర్స్ రెపో వడ్డీరేట్లు 25 బేసిస్ పాయింట్లు తగ్గుతాయన్న అంచనాలున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల పతనం మధ్య 50 బేసిస్ పాయింట్లు తగ్గేంచే వీలు లేకపోలేదని డిబిఎస్ అభిప్రాయపడింది. అయతే దీనికి అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయని డిబిఎస్ పేర్కొంది. రాబోయే ఆర్‌బిఐ ద్రవ్యసమీక్ష నూతన ఆర్థిక సంవత్సరం (2016-17)లో జరిగే తొలి ద్వైమాసిక ద్రవ్యసమీక్ష కానుంది.