బిజినెస్

భారత్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెడితే లాభాలు తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, ఏప్రిల్ 2: భారత దేశంలో స్థిరస్తి రంగంలో పెట్టుబడులు మంచి లాభాలను పంచుతాయన్న విశ్వాసం మదుపర్లలో నెలకొంది. అయితే కొన్ని ప్రభుత్వ విధానాలవల్ల పారదర్శత లోపించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇక్కడి పా రిశ్రామిక పాలకవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సార్వభౌమ, పింఛన్ నిధుల సహా విదేశీ నిధులు భారత దేశంలో పెద్దమొత్తంలో పెట్టుబడులుగా మారుతున్నాయి. ఇటీవల కెనడియన్ పెన్షన్ ఫండ్, ఖతార్ ఫండ్స్, జీఐసీ, సింగపూర్‌కు చెందిన టెమాసెక్ వంటి సంస్థలెన్నో ఇటీవలి కాలంలో భారత్‌లో పెట్టుబడులు పెట్టుబడులు పెట్టాయని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ కమిటీ చైర్మన్ సంజయ్ దత్ పేర్కొన్నారు. ప్రస్తుతం భారత దేశంలో లొసుగులను తొలగించే సరికొత్త విధానాలు వస్తున్నాయని నిర్మాణ రంగంలో డెవలపర్స్ సక్రమంగా రికార్డులను నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే మదుపర్లు ప్రస్తుతం ఉన్న మార్కెట్ నియంత్రణలను, పన్ను విధానాన్ని అర్థం చేసుకోవాల్సివుందని దత్ పేర్కొన్నారు. డాలర్‌కు భారత రూపాయి మారకానికి ఉన్న తేడా, కరెన్సీ కష్టాల నడుమ డిమాండ్‌కు తగినట్టుగా పనితీరును అందించగలిగే అంశాలను మదుపర్లు పరిశీలించాలని సూచించారు. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ చట్టం, గూడ్స్ అండ్ సర్వీస్ పన్ను తదితరాలపై క్షుణ్ణంగా అవగాహన కలిగివుండాలన్నారు. భారత్‌లో పెట్టుబడులు ఖచ్ఛితమైన లాభాలను పంచుతాయన్న విశ్వాసం విదేశీ పెట్టుబడిదారుల్లో ప్రస్తుతం మరింత పెరిగిందని ఆయన అన్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి సింగపూర్‌లో ఎఫ్‌ఎల్‌సీసీ రియల్ ఎస్టేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత్ వివిధ దశల్లో అక్కడి పెట్టుబడిదారులతో సమాశాలు నిర్వహించి మరింత విశ్వాసాన్ని నింపిందని దత్ చెప్పారు. భారత దేశానికి స్థిరస్తి రంగంలో అన్ని వౌలిక సదుపాయాలు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సీఈవో, ఎండీ బాధ్యతలు సైతం నిర్వహిస్తున్న దత్ తెలిపారు. 3రెరా, జీఎస్టీ అమల్లోకి వచ్చాక డెవలపర్లందరూ పరస్పర సహకారంతో పనిచేస్తున్నారని ప్రాజెక్టుల పూర్తిలో ఎలాంటి అలసత్వం చోటుచేసుకోకుండా చర్యలు చేపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే పదేళ్ల కాలంలో దేశంలోని నాలుగు జోన్లలో స్థిరస్తి, నిర్మాణ రంగాలు మరింతగా బలపడుతాయని ఆయన వివరించారు.