బిజినెస్

పని ప్రదేశాల్లో అగ్రగామి సంస్థలుగా ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఓయో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: వాల్‌మార్ట్ అధీనంలోని ఫ్లిప్‌కార్ట్ మనదేశంలోని అత్యంత ప్రాధాన్యత కలిగిన పనిప్రదేశంగా గుర్తింపు పొందింది. తర్వాతి స్థానాల్లో అమెజాన్, ఓయో సంస్థలు నిలిచాయి. ప్రొఫెషనల్ సోషల్ మీడియా నెట్‌వర్క్ ‘లింకేడ్లిన్’ ఈమేరకు తన నాల్గవ ఎడిషన్ అధ్యయన నివేదికను బుధవారం ఇక్కడ విడుదల చేసింది. 2019 టాప్ కంపెనీల జాబితాలో తొలి పది స్థానాలను ఇంటర్నెట్ కంపెనీలు ఆక్రమించాయి. ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలిసారిగా ఈ పది అగ్రగామి కంపెనీల జాబితాలోకి వచ్చి ఏడో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా కొత్తగా ఏర్పాటైన గృహ అంతర్జాల, వినియోగదారుల సేవా సంస్థలు స్విగ్గీ, జొమాటో ఆరు, ఎనిమిదో ర్యాంకులను సాధించడం విశేషం. అలాగే ఒన్97 కమ్యూనికేషన్స్ నాలుగో స్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన చమురు, సహజ వాయుల విభాగం 10వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర కంపెనీల్లో కన్సలింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) 13వ స్థానంలో, ఎస్ బ్యాంకు 14, ఐబీఎం 15, డైమ్‌లర్ ఏజీ 16, ఫ్రెష్‌వర్క్స్ 17, యాక్సెంచర్ 18, ఓలా 19, ఐసీఐసీ బ్యాంకు 20, పీ డబ్ల్యుసీ ఇండియా 21, కేపీఎంజీ ఇండియా 22, లార్సన్ అండ్ టర్బో 23, ఒరాకిల్ 24, క్వాల్‌కామ్ 25 స్థానాల్లో నిలిచాయని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అగ్రగామి కంపెనీల జాబితాలో సుమారు సగభాగం కొత్త కంపెనీలే చోటు దక్కించుకోవడం విశేషమని లింకేడ్లిన్ ణండియా మేనేజింగ్ ఎడిటర్ ఎడిత్ చార్లీ పేర్కొన్నారు. ఈ కంపెనీల్లో అధిక శాతం నిర్వహణ, వాణిజ్యాన్ని విస్తరిస్తూ ఇంజనీరింగ్ ఉద్యోగాలు సమకూరుస్తున్నాయని నివేదిక పేర్కొంది.