బిజినెస్

దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: దేశీయ విమాన సర్వీసుల్లో ఇండిగో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం మార్కెట్‌లో ఇండియో 43.2 శాతాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాతి స్థానం స్పైస్ జెట్ ఆక్రమించింది. 13.7 శాతం మార్కెట్‌ను స్పైస్ జెట్ సొంతం చేసుకోగా, ఎయిర్ ఇండియా 12.8 శాతంతో మూడో స్థానంలో ఉంది. జెట్ ఎయిర్‌వేస్ 10 శాతం, గో ఎయిర్ 9 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. మిగతా మార్కెట్‌ను ఎయిర్ ఏషియా (5.1 శాతం), విస్టారా (4.0 శాతం), జెట్ లైట్ (1.4 శాతం), ట్రూ జెట్ (0.5 శాతం)తోపాటు ఎయిర్ హెరిటేజ్, స్టార్ ఎయిర్ కూడా పంచుకుంటున్నాయి. కాగా, సర్వీసుల రద్దులో ఎయిర్ హెరిటేజ్ అన్నిటి కంటే ముందున్నది. ఆ సంస్థ సర్వీసులు సగటున 35 శాతం రద్దయ్యాయి. సర్వీసులను రద్దు చేసిన సంస్థల్లో ఎయిర్ ఇండియా (8.15 శాతం), ఎయిర్ ఏషియా (2.46 శాతం), జెట్ ఎయిర్‌వేస్ (2.31 శాతం), స్టార్ ఎయిర్ (1.96 శాతం), ఇండిగో (1.88 శాతం), స్పైస్ జెట్ (1.03 శాతం), విస్టారా (0.82 శాతం), గో ఎయిర్ (0.61 శాతం) కూడా ఉన్నాయి.