బిజినెస్

మార్కెట్లకు సెబీ ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్టాక్ మార్కెట్లకు సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛ్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తీసుకుంటున్న పలు నిర్ణయాలు ఊతమిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక వ్యవస్థలు అనిశ్చిత పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, దేశం లో స్టాక్ మార్కెట్లు కుదేలు కాకుండా ఉన్నాయంటే, అందు కు సెబీ చేపటుతున్న చర్యలు, ఆమోదించిన తీర్మానాలే ప్రధాన కారణం. వాటిలో స్టాక్ ఎక్ఛ్సేంజీల నుంచి వసూలు చేస్తున్న రెగ్యులేటరీ ఫీజును తగ్గించడం ప్రధానమైనది. సెమీ ఈ ఫీజును 80 శాతం తగ్గించడాన్ని సంచలనాత్మక నిర్ణయంగా పేర్కోవచ్చు. సెబీ తీసుకున్న నిర్ణయం ప్రకారం, కోటి రూపాయల విలువైన లావాదేవీలకు ఒక రూపాయిని మాత్రమే సెబీ వసూలు చేస్తుంది. ఒకవేళ లావాదేవీలు పది లక్షల కోట్లను దాటితే, ప్రతి కోటి రూపాయలకు అదనంగా ఆరు రూపాయల రెగ్యులేటరీ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా, డిబెంచర్ ట్రస్టీల నిబంధనలను కూడా సెబీ సవరించింది. తద్వారా, డిబెంచర్‌దారులకు మరింత ప్రయోజనం చేకూరింది. డిబెంచర్ ట్రస్టీల సమావేశాల్లో తీర్మానాలకు ప్రత్యక్ష ఓటింగ్‌తోపాటు ఈ-ఓటింగ్‌ను కూడా అనుమతివ్వడానికి సెబీ అంగీకరించడం, ఈ రంగంలో నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశాలను సుగమమం చేసింది. కాగా, పారిశ్రామిక రంగంలోనూ సెబీ గత ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలు, కొత్త ఆర్థిక సంవత్సరంలో ఫలితాలనిస్తుందనేది వాస్తవం. స్టార్టప్స్‌లో పెట్టుబడులను ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. ఆవిష్కరణల పెంపుదలకు నిర్దేశించిన వేదికను పెట్టుబడిదారులను ఆకర్షించేదిగా తీర్చిదిద్దాలని తీర్మానించింది. ఎన్ని కొత్త ఆవిష్కరణలు జరిగితే, పారిశ్రామిక రంగం అంతగా విస్తృతమై, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. అందుకే, ఇందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలను సెబీ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని సాధ్యమైనంత త్వరలో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నది. స్టార్టప్స్‌లో పెట్టుబడులను ప్రోత్సహించాలని సెబీ నిర్ణయించింది. ఆవిష్కరణల పెంపుదలకు నిర్దేశించిన వేదికను పెట్టుబడిదారులను ఆకర్షించేదిగా తీర్చిదిద్దాలని సెబీ తీర్మానించింది. ఇందుకు అవసరమైన ప్రణాళికలు, వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. స్టాక్ ఎక్ఛ్సేంజీలు, డిపాజిట్‌దారులకు గుర్తింపు కార్డులను విడుదల చేస్తుంది. అదే సమయంలో ఈ అక్రిడిటేషన్ కోసం సమర్పించాల్సిన పత్రాలు, పాటించాల్సిన విధివిధానాలను సరళీకృతం చేసింది. ఈ గుర్తింపు కార్డును ఇవ్వాలంటే, నికర ఆదాయం కనీసం 50 లక్షల రూపాయలు, ద్రవ్య లబ్ధత కనీసం 5 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్టు సెబీ వివరించింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని రీతిలో, స్టాక్ ఎక్ఛ్సేంజీలు, డిపాజిట్‌దారులకు గుర్తింపు కార్డులను ఇస్తున్నది. అదే సమయంలో ఈ అక్రిడిటేషన్ కోసం సమర్పించాల్సిన పత్రాలు, పాటించాల్సిన విధివిధానాలను సరళీకృతం చేసింది. తద్వారా ఎక్కువ మంది స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో ఉత్సాహంగా పాల్గొనే అవకాశాన్ని కల్పించింది. ఈ గుర్తింపు కార్డును ఇవ్వాలంటే, నికర ఆదాయం కనీసం 50 లక్షల రూపాయలు, ద్రవ్య లబ్ధత కనీసం 5 కోట్ల రూపాయలుగా నిర్ణయించినట్టు సెబీ వివరించింది. స్టాక్ మార్కెట్ లావాదేవీల్లో ఈ ఆదాయం అసాధ్యమేమీ కాదు. ఇలావుంటే, వస్తు ఉత్పన్నాల సెగ్మెంట్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశాన్ని మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫిలియో మేనేజర్స్‌కు కూడా విస్తరిస్తూ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం, వస్తువులను మార్కెట్ చేసే సదుపాయాన్ని కూడా మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫిలియో మేనేజర్స్‌కు ఇచ్చింది. ఈ చర్య వస్తువుల ఉత్పత్తి, రవాణా, సరఫరా రంగాలను బలోపేతం చేస్తుంది. ఉత్పత్తి పెరిగి, కొత్తకొత్త ఆవిష్కరణలు జరిపి, కొత్తకొత్త కంపెనీలు తెరపైకి వస్తే, షేర్ మార్కెట్లు ఎంతగా అభివృద్ధి చెందుతాయో ఊహించుకోవచ్చు. సెబీ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో చూడాలి.